క్షీణిస్తోన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

Delhi Army Hospital Releases Bulletin, Former President Pranab Mukherjee, Former President Pranab Mukherjee Still in Deep Coma, pranab mukherjee condition, pranab mukherjee health, pranab mukherjee health latest, pranab mukherjee health status, pranab mukherjee latest update

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్ ఆసుపత్రి బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ లో‌ పేర్కొంది. ఆయన కిడ్నీల పనితీరులో కూడా నిన్నటి నుండి కొంచెం సమస్యను గుర్తించినట్టు తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని బులెటిన్ లో వెల్లడించారు.

ముందుగా మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ముఖర్జీకి వైద్యులు ఆపరేషన్‌ నిర్వహించారు. అదే సందర్భంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు గుర్తించారు. అప్పటి నుంచే కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + two =