అక్టోబర్ 18న జరుగనున్న బీసీసీఐ అధ్యక్ష పదవి ఎన్నికలు.. ఈసారి రేసులో పోటీ పడేది ఎవరంటే?

Former Indian Cricketer Roger Binny Likely to Replace Sourav Ganguly as Next BCCI President, Former Indian Cricketer Roger Binny, Replace Sourav Ganguly as BCCI President, Roger Binny For Next BCCI President, Mango News, Mango News Telugu, Indian Cricketer Roger Binny, BCCI President Sourav Ganguly, Sourav Ganguly Latest News And Updates, BCCI President Elections, BCCI President Roger Binny, Roger Binny, Sourav Ganguly, BCCI, The Board of Control for Cricket in India

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ పదవీకాలం మరో పది రోజుల్లో ముగియనుంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీనే మళ్లీ పోటీ చేస్తాడా? లేదంటే కార్యదర్శి జై షా నిలుస్తాడా? అనే చర్చ సాగుతోంది. అయితే గంగూలీ మరోసారి అధ్యక్షా పదవికి పోటీకి ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ గంగూలీ ఈ పదవిలో కొనసాగడానికి అంతగా ఉత్సాహం చూపించట్లేదని సమాచారం. అయితే సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవికి పోటీ పడే యోచనలో ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బోర్డు నూతన అధ్యక్షుడుగా బరిలో ఎవరుంటారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సౌరవ్‌ గంగూలీ స్థానంలో భారత మాజీ క్రికెటర్ మరియు 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు బీసీసీఐ నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో కర్ణాటక క్రికెట్‌ సంఘం తరఫున ప్రతినిధిగా బిన్నీ పేరు చేర్చడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. కాగా గతంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం బిన్నీకి ఉంది. ఇంకోవైపు ప్రస్తుత బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వినిపిస్తోంది. ఇక బీసీసీఐ సెక్రటరీ పదవిలో మాత్రం జైషానే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బీసీసీఐ అధ్యక్ష పదవి ఎన్నికలకు అక్టోబరు 11, 12 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 13న జరుగనుండగా, అభ్యర్థులు తాఅక్టోబర్ 14లోగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే అక్టోబర్ 18న ఉదయం ఎన్నికలు జరగనుండగా, అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + five =