అక్టోబర్ 9 నుండి 11 వ‌ర‌కు గుజరాత్‌ లో ప్రధాని మోదీ పర్యటన, పలు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు

PM Narendra Modi will Visit Gujarat State from 9th to 11th October, Prime Minister Modi Visit To Gujarat From October 9 To 11, Foundation Laying And Inauguration Of Various Projects, Prime Minister Modi Visit To Gujarat, PM Modi Visit To Gujarat, PM Modi Gujarat Visit, Mango News, Mango News Telugu, PM Modi To Visit Gujarat Again, PM To Visit Gujarat On 9-11 October, Pm On Visit To State From Oct 9, PM Modi Gujarat Visit, PM Modi On Two-Day Visit Gujarat , Narendra Modi Gujarat Visit Schedule 2022, PM Narendra Modi , PM Narendra Modi News And Live Updates

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9 నుండి 11వ తేదీ వ‌ర‌కు గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అక్టోబరు 9, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మెహసానాలోని మోధేరాలో ప్రధాని మోదీ రూ.3900 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు చేయ‌నున్నారు. ఈ సందర్భంగా భారతదేశం యొక్క మొట్టమొదటి 24×7 సౌరశక్తితో పనిచేసే గ్రామంగా మోధేరా గ్రామాన్ని ప్రధాని ప్రకటిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటలకు మోధేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 7:30 గంటలకు సన్ టెంపుల్ ను ప్రధాని సందర్శిస్తారు.

ఇక అక్టోబరు 10, సోమవారం ఉదయం 11 గంటలకు బరూచ్‌లోని అమోద్‌లో ప్రధాని మోదీ రూ.8000 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు అహ్మదాబాద్‌లో శైక్షనిక్ సంకుల్‌ను ప్రారంభిస్తారు. ఆ త‌ర్వాత సాయంత్రం 5:30 గంట‌ల‌కు జామ్‌న‌గ‌ర్‌లో రూ.1460 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేయడంతో పాటుగా మరికొన్నింటికి శంకుస్థాప‌న చేస్తారు. అలాగే అక్టోబరు 11, మంగళవారం మధ్యాహ్నం 2:15 గంటలకు అహ్మదాబాద్‌లోని అసర్వా సివిల్ హాస్పిటల్‌లో దాదాపు రూ.1300 కోట్ల విలువైన వివిధ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రారంభించడంతో పాటుగా కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరుకుని ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీ మ‌హాకాల్ లోక్‌ని జాతికి అంకితం చేస్తారు. మహకాల్ లోక్ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలను అందించడం ద్వారా ఆలయాన్ని సందర్శించే యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని తెలిపారు. రాత్రి 7:15 గంటలకు ఉజ్జయినిలో బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ మేరకు ప్రధానిమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =