ప్రముఖ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ కన్నుమూత

Balika Vadhu Fame Surekha Sikri, Balika Vadhu Fame Surekha Sikri Passes Away, Balika Vadhu Fame Surekha Sikri Passes Away at 75, Mango News, National Award-winning actor Surekha Sikri, National Award-winning actor Surekha Sikri dies, National Award-winning actor Surekha Sikri dies at 75, Surekha Sikri Death, Surekha Sikri Death News, Surekha Sikri dies at 75, Surekha Sikri Passes Away, Surekha Sikri Passes Away at 75

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, అనేక బాలీవుడ్ సినిమాల్లో సహాయనటిగా, సీరియల్స్ ద్వారా ఆమె దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న సురేఖ సిక్రీ, తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

ముందుగా కిస్సా కుర్సీకా అనే సినిమాతో ఆమె నటిగా వెండితెరపై అరంగ్రేట్రం చేశారు. ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ మమ్మో, తమస్‌, బధాయి హో చిత్రాలకుగాను సహాయనటిగా ఆమె మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. గత సంవత్సరం జోయా అక్తర్ దర్శకత్వం వహించిన అంథాలజీ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’లో సురేఖ సిక్రీ చివరిసారిగా నటించారు. నటి సురేఖ సిక్రీ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు, టీవీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − nine =