పంజాబ్ లో కాంగ్రెస్ కు షాక్, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత అశ్వనీ కుమార్ రాజీనామా

Ashwani Kumar Ex Minister Quits Congress, Ashwani Kumar quits, Ashwani Kumar quits Congress, Ashwani Kumar Quits the Party, Congress Leader Ashwani Kumar Quits Party, Congress Leader Ashwani Kumar Quits the Party, Ex-Minister Ashwani Kumar Quits Congress, Former law minister Ashwani Kumar quits Congress, Former Law Minister Ashwani Kumar resigns, Former Law Minister Ashwani Kumar resigns from Congress, Former Union Minister, Former Union Minister Senior Congress Leader Ashwani Kumar, Former Union Minister Senior Congress Leader Ashwani Kumar Quits the Party, Mango News, Senior Congress Leader Ashwani Kumar Quits the Party

పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, పంజాబ్ లో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులలో ఒకరైన అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి పంపారు. “ఈ విషయంలో ఆలోచనాత్మకంగా పరిశీలన చేసుకున్నాక, ప్రస్తుత పరిస్థితుల్లో మరియు నా గౌరవానికి అనుగుణంగా జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ బయటే ఉత్తమ సేవలు నిర్వహించగలనని నిర్ధారించుకున్నాను. అందుకు అనుగుణంగా 46 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం తర్వాత పార్టీ నుండి నిష్క్రమిస్తున్నాను. మన స్వాతంత్య్ర సమరయోధులు ఊహించిన ఉదార ప్రజాస్వామ్యం యొక్క గౌరవప్రదమైన వాగ్దానాల ఆధారంగా, పరివర్తనాత్మక నాయకత్వం యొక్క ఆలోచనతో ప్రేరణ పొందిన ప్రజా ప్రయోజనాలను ముందస్తుగా కొనసాగించాలని ఆశిస్తున్నాను” అంటూ అశ్వనీ కుమార్ సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడడం బాధాకరమైన నిర్ణయమని, కాంగ్రెస్ లో అంతర్గత ప్రక్రియలు ఎలా ఉన్నాయో గ్రహించానని అశ్వనీ కుమార్ అన్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. ఇటీవలే మాజీ కేంద్ర మంత్రి, యూపీ కాంగ్రెస్‌ కీలక నాయకుడు ఆర్‌పిఎన్ సింగ్ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తేదీన 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కూటమి మధ్య ముక్కోణపు పోటీ నెలకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 6 =