భారతీయులు వెంటనే ఉక్రెయిన్‌ విడిచి వెళ్ళండి – భారత రాయబార కార్యాలయం సూచన

Amid Rising Tensions In Ukraine, India Asks Its Citizens To Leave Country For Now, India asks its citizens to leave Kiev temporarily, India asks its citizens to leave Ukraine temporarily, Indian Embassy, Indian Embassy asks Indians to leave Ukraine, Indian Embassy in Kyiv, Indian embassy in Kyiv advises Indians to leave Ukraine, Indian embassy in Kyiv asks citizens to leave Ukraine, Indian Embassy in Kyiv Asks Its Citizens and Students To Leave Ukraine, Indian Embassy in Kyiv Asks Its Citizens and Students To Leave Ukraine Amid Rising Tensions with Russia, Kyiv, Kyiv Asks Its Citizens and Students To Leave Ukraine Amid Rising Tensions with Russia, Leave Ukraine Amid Rising Tensions with Russia, Mango News, Ukraine

రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఉక్రెయిన్‌ లోని భారత రాయబార కార్యాలయం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులను ముఖ్యంగా బస అవసరం లేని విద్యార్థులను ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా తాత్కాలికంగా దేశం విడిచి వెళ్ళమని కోరింది. అదే సమయంలో భారతీయ పౌరులు ఉక్రెయిన్‌ దేశంలో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన చోట దౌత్య కార్యాలయం వారిని చేరుకోవడానికి వీలుగా ఉక్రెయిన్‌లో తమ ఉనికిని గురించి రాయబార కార్యాలయానికి తెలియజేయవలసిందిగా భారతీయ పౌరులకు తెలియజేయబడింది.

ఈ క్లిష్ట సమయంలో రాయబార కార్యాలయం భారత పౌరులకు అన్ని సేవలను అందించడానికి సదా సిద్ధంగా ఉంది అని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉన్నందున ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఈ సలహా వచ్చింది. రష్యా గత 48 గంటల్లో.. బెలారస్, క్రిమియా మరియు పశ్చిమ రష్యాలో సైనిక బలగాలను పెంచింది. ఉక్రెయిన్‌ను విడిచిపెట్టమని తమ జాతీయులకు పిలుపునిచ్చిన దేశాలలో యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఐర్లాండ్, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, కెనడా, నార్వే, ఎస్టోనియా, లిథువేనియా, బల్గేరియా, స్లోవేనియా, ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =