పర్యాటకులకు మూడు రోజులపాటు ‘తాజ్ మ‌హ‌ల్‌’ లోకి ఉచిత ప్రవేశం

Free Entry For Tourists For Three Days At Taj Mahal on Shah Jahan's Urs Commemoration, Free Entry For Tourists, Free Entry For Tourists For Three Days At Taj Mahal, Three Days Free Entry At Taj Mahal, Taj Mahal, Shah Jahan's Urs Commemoration, Shah Jahan's, Shah Jahan's Taj Mahal, 367 'Urs' of the fifth Mughal emperor Shah Jahan, fifth Mughal emperor Shah Jahan, free entry to Taj Mahal from February 27 to March 1, free entry to Taj Mahal, Agra, 367 'Urs', Taj Mahal Latest News, Taj Mahal Latest Updates, Taj Mahal Live Updates, Mango News, Mango News Telugu,

‘తాజ్ మ‌హ‌ల్‌’.. ప్రపంచం లోని 7 వింతల్లో ఒకటిగా పేరొందిన భారతీయ ప్రేమ సౌధం. ఐదవ మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన ప్రియమైన భార్య ‘ముంతాజ్’ కోసం 400 సంవత్సరాల క్రితం నిర్మించిన సుందర సౌధం. అలాంటి తాజ్‌ మహల్‌ లోకి పర్యాటకులకు మూడు రోజుల పాటు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. షాజహాన్‌ 367 ఉర్స్‌ ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 27 నుంచి  మార్చి 1వ తేదీ వరకు సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తునున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ఆగ్రా సర్కిల్‌ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌ తెలిపారు.

అయితే, సందర్శకులు కోవిడ్‌-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు పర్యాటకులకు ప్రవేశం ఉంటుందని, మార్చి 1న సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉచిత ప్రవేశం ఉంటుందని పటేల్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉర్సు సందర్భంగా ఈ మినహాయింపు ఇస్తారు అని టూరిస్ట్‌ గైడ్స్‌ అసోసియేసన్‌ అధ్యక్షుడు షంసుద్దీన్‌ ఖాన్‌ తెలిపారు. ఆ సమయంలో చాదర్‌ పోషి, శాండల్‌, గుసుల్‌, కుల్‌ తదితర వివిధ ఆచారాలను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + four =