కరోనా చికిత్సకు ఫవిపిరవిర్‌ డ్రగ్, భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి

Coronavirus Tablet, Covid drug, COVID-19 Drug Favipiravir, Favipiravir, Favipiravir antiviral tablets, Favipiravir Drug COVID-19, Favipiravir Drug to Treat COVID-19, Glenmark Launches COVID-19 Drug, Glenmark Launches COVID-19 Drug Favipiravir, Glenmark Launches Favipiravir Drug, Glenmark Launches Favipiravir Drug to Treat COVID-19, Umifenovir drugs

దేశంలో కరోనా విజృంభణతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నియంత్రణకు ఔషధం విడుదల చేసి శుభవార్త అందించింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్ అనే ఔషదాలపై అధ్యయనం చేయగా ఫవిపిరవిర్  స్వల్ప, మధ్యస్థ కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారిపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఔషధంపై మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.

మరోవైపు ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరుతో ఈ టాబ్లెట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కావాల్సిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి జూన్ 19, శుక్రవారం నాడు పొందినట్టు గ్లెన్‌ మార్క్ కంపెనీ ప్రకటించింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు  తెలిపారు. కాగా ఒక్కో టాబ్లెట్ ధర రూ.103 గా ఉంటుందని, కరోనావైరస్ సోకిన వారు 1800 ఎంజీ టాబ్లెట్స్ ను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలనీ, అనంతరం వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ టాబ్లెట్స్ ను రోజుకు రెండుసార్లు చొప్పున వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా డయాబెటిక్‌, గుండెజబ్బుతో బాధపడేవారు కూడా ఈ టాబ్లెట్స్ వాడొచ్చని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 19 =