గుజరాత్‌లో ఘోరం, ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది దుర్మరణం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Gujarat 12 Labourers Demise in Wall Collapse at Salt Factory in Morbi PM Modi Announces Rs 2 lakh Ex-gratia, PM Modi Announces Rs 2 lakh Ex-gratia, Gujarat 12 Labourers Demise in Wall Collapse at Salt Factory in Morbi, 12 Labourers Demise in Wall Collapse at Salt Factory in Morbi, Gujarat 12 Labourers Demise in Wall Collapse at Salt Factory, Wall Collapse at Salt Factory, Salt Factory in Morbi, Morbi Salt Factory, Gujarat 12 Labourers Demise, PM Modi Announces Rs 2 lakh Ex-gratia For Gujarat 12 Labourers Demise in Wall Collapse at Salt Factory, 2 lakh Ex-gratia For Gujarat 12 Labourers Demise in Wall Collapse at Salt Factory, Morbi Salt Factory News, Morbi Salt Factory Latest News, Morbi Salt Factory Latest Updates, Morbi Salt Factory Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

గుజరాత్‌లో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మోర్బి జిల్లాలో ఒక ఉప్పు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో బుధవారం 12 మంది కార్మికులు దుర్మరణం చెందారు. గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) పరిధిలోని హల్వాద్ పారిశ్రామిక ప్రాంతంలోని సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా మాట్లాడుతూ.. హల్వాద్ పారిశ్రామిక ప్రాంతంలోని సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో కనీసం 12 మంది ఫ్యాక్టరీ కార్మికులు మరణించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వీరిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.

మోర్బిలోని ఉప్పు కర్మాగారంలో గోడ కూలి 12 మంది కూలీలు మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వబడుతుంది. మరోవైపు దీనిపై స్పందించిన గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున సిఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థికసాయం ప్రకటించారు. తక్షణ రెస్క్యూ ఆపరేషన్ కోసం మోర్బి జిల్లా కలెక్టర్ మరియు సిస్టమ్ ఆపరేటర్లను పటేల్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 15 =