అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజ‌రాత్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన హార్దిక్ పటేల్.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా

Hardik Patel Resigns as Working President of Gujarat Congress Months Ahead of Assembly Polls, Months Ahead of Assembly Polls, Hardik Patel Resigns as Working President of Gujarat Congress, Hardik Patel, Gujarat Congress working president, Hardik Patel Resigns as Gujarat Congress working president, Working President of Gujarat Congress, Hardik Patel Quits Congress, Assembly Polls, Hardik Patel has resigned from the Congress party, Gujarat Congress working president News, Gujarat Congress working president Latest News, Gujarat Congress working president Latest Updates, Gujarat Congress working president Live Updates, Mango News, Mango News Telugu,

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ‘పటీదార్’ ఉద్యమ నాయకుడు, యువనేత హార్దిక్ పటేల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట కార‌ణంగా ఆయ‌న ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం గుజరాత్ మరియు గుజరాతీలను ద్వేషిస్తోందని ఆరోపిస్తూ హార్దిక్ పటేల్ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్.. దేశం మరియు సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. గత ఏడాది కాలంగా, హార్దిక్ పటేల్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంస్థాగత నిర్ణయాలలో తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ఇది తన రాజకీయ అవకాశాలను దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ ఉన్నారు.

హార్దిక్ పటేల్ బుధవారం ఉదయం ట్విటర్‌లో దీనిపై తన స్పందన తెలియజేశాడు. ‘ఈ రోజు, నేను ధైర్యంతో, కాంగ్రెస్ పార్టీ పదవికి మరియు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా నిర్ణయాన్ని ప్రతి స్నేహితుడు మరియు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని నేను ఆశిస్తున్నాను. నా ఈ చర్య భవిష్యత్తులో గుజరాత్‌కు సానుకూలంగా పనిచేయడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నాడు. గుజరాత్‌లో 2015 ‘పటీదార్’ రిజర్వేషన్ ఆందోళన తర్వాత వెలుగులోకి వచ్చిన 28 ఏళ్ల హార్దిక్ పటేల్, 2019లో కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత జూలై 2020లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల కాంగ్రెస్ చింతన్ శిబిర్‌కు కూడా హార్దిక్ గైర్హాజరయ్యాడు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ఖోడల్ధామ్ వ్యవస్థాపకుడు మరియు పటీదార్ నాయకుడు నరేష్ పటేల్‌ను కూడా కలవడం విశేషం. త్వరలోనే ఎన్నికలు రానుందున హార్దిక్ అడుగులు పడతాయో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =