రాజీవ్‌ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష తర్వాత దోషి పేరరివాళన్​ విడుదల

Rajiv Gandhi Assassination Case Supreme Court Orders to Release Life Convict AG Perarivalan, Supreme Court Orders to Release Life Convict AG Perarivalan, Life Convict AG Perarivalan, Supreme Court Orders to Release Life Convict, SC Orders to Release Life Convict AG Perarivalan, Rajiv Gandhi Assassination Case, Former Prime Minister of India Rajiv Gandhi Assassination Case, Former Prime Minister Assassination Case, AG Perarivalan, Supreme Court Orders to Release AG Perarivalan, Perarivalan was a convict in the Rajiv Gandhi assassination case, Former Prime Minister of India Rajiv Gandhi, Rajiv Gandhi, Rajiv Gandhi Assassination Case News, Rajiv Gandhi Assassination Case Latest News, Rajiv Gandhi Assassination Case Latest Updates, Rajiv Gandhi Assassination Case Live Updates, Mango News, Mango News Telugu,

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం సంచలన ఆదేశాలు ఇచ్చింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పేరరివాళన్​ ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో పేరరివాళన్​ ఇప్పటికే మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. తనను విడుదల చేయాలని పేరరివాళన్​ చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ముందుగా 2015లో తనను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు గవర్నర్‌ కు పేరరివాళన్​ క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారు. అయితే గవర్నర్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం 2017లో తమిళనాడు ప్రభుత్వం పేరరివాళన్​ కు మొదటిసారి పెరోల్ మంజూరు చేయడంతో పాటుగా, అప్పటి తమిళనాడు కేబినెట్ ఈ కేసులో మొత్తం ఏడుగురు దోషులను విడుదల చేయాలని సిఫార్సు చేసింది. అనంతరం పేరరివాళన్​పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయగా, గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఆ ఫైల్‌ను రాష్ట్రపతి పంపించారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి విచారణ అనంతరం ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తూ పేరరివాళన్​ ను విడుదల చేయాలని జస్టిస్​ ఎల్​.నాగేశ్వర రావ్​ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

1991, మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌ లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేయడంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకుగురయిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా 19 ఏళ్ల ఏజీ పేరరివాళన్​ ను సీబీఐ అరెస్ట్ చేసింది. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు ఉపయోగించిన బాంబులో రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేసినట్లు ఆరోపణలపై ఉగ్రవాదం, విధ్వంసక కార్యకలాపాల (నివారణ) చట్టం టాడా కింద పేరరివాళన్​ పై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం 1998లో టాడా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ముందుగా సుప్రీంకోర్టు ఆ శిక్షను సమర్థించినప్పటికీ, 2014లో మరణశిక్షను జీవితఖైదుగా మార్చుతూ తీర్పు ఇచ్చింది. కాగా 2021 మరోసారి పెరోల్‌పై బయటకు వచ్చిన పేరరివాళన్​ కు తమిళనాడు ప్రభుత్వం పెరోల్‌ను పొడిగిస్తూ వస్తుంది. అలాగే గత మార్చిలో పేరరివాళన్​ కు సుప్రీంకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలోనే కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు, 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష తర్వాత పేరరివాళన్​​ ను విడుదల చేయాలని ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eight =