గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశలో భాగంగా రేపే 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్

Gujarat Assembly Elections-2022 First Phase of Polling will be held in 89 Constituencies Tomorrow,Gujarat Assembly Elections,Congress Chief Mallikarjun Kharge,Compared Pm Modi To Ravana, Bjp Furious,Mango News,Mango News Telugu,Prime Minister Narendra Modi, Narendra Modi News and Updates,PM Modi Latest News and Updates,PM Modi,Prime Minister Modi,Indian Prime Minister Modi Latest News and Updates, Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Gujarat Assembly News And Live Updates

గుజరాత్ రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రేపు (డిసెంబర్ 1, గురువారం) తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగనుంది. తొలి దశలో పోలింగ్‌ జరగనున్న 89 స్థానాలకు గానూ 788 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరిలో 70 మంది మహిళలు, 339 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. తోలి దశ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 25,430 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దక్షిణ గుజరాత్‌, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో గురువారం పోలింగ్ జరగనుంది.

గుజరాత్ లో ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే కీలక పోటీ నెలకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు కీలక నేతలు, కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బాఘేల్, అలాగే ఆప్ నుంచి ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తదితరులు పలు బహిరంగ సభలు నిర్వహించి, ఎన్నికల ప్రచారంతో హోరెత్తించారు.

తోలి దశ పోలింగ్‌లో గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, కున్వర్జీ బవలియా, కాంతిలాల్ అమృతియా వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. గుజరాత్ ప్రజలు మరోసారి కూడా బీజేపీవైపే మొగ్గుచూపుతారా?, కాంగ్రెస్ పుంజుకుంటుందా?, ఆప్ ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనే విషయాలపై మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక గుజరాత్ లో రెండో దశలో భాగంగా 93 స్థానాలకు గానూ డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, మొత్తం ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =