పరీక్షా పే చ‌ర్చ-2023 కార్య‌క‌లాపాల‌లో పాల్గొనండి, విద్యార్థులు, పేరెంట్స్, టీచర్లకు ప్ర‌ధాని మోదీ ఆహ్వానం

PM Modi Invites Students Parents Teachers to Take Part in Interesting Activities of Pariksha Pe Charcha 2023,PM Invites Students Parents And Teachers,Participate In Pariksha Pay Charcha,Pariksha Pay Charcha Activities,Pariksha Pay Charcha,Pariksha Pay Charcha 2023,Mango News,Mango News Telugu,PM Narendra Modi, Modi Latest News And Updates,Gujarat Assembly News And Live Updates,Pariksha Pay Charcha News And Live Updates,Pariksha Pay Charcha Latest News and Updates,Prime Minister Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో సంభాషించి, విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షల రాసే అంశంపై ప్రధాని మోదీ కీలక సూచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా పే చ‌ర్చ-2023కి సంబంధించిన ఆస‌క్తిక‌ర కార్య‌క‌లాపాల‌లో పాల్గొనాల‌ని విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల‌ను ప్ర‌ధాని మోదీ తాజాగా ఆహ్వానించారు. మ‌న విద్యార్థుల కోసం ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని పేర్కొన్నారు.

ముందుగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ, అంతా ఎదురుచూస్తున్న ఇంటరాక్షన్ అయిన పరీక్షా పే చ‌ర్చ-2023 కోసం సిద్ధంగా ఉండండి. పరీక్షా పే చ‌ర్చ-2023 కార్యకలాపాలలో పాల్గొనండి మరియు ప్రధాని మోదీతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం పొందండి అని పేర్కొంది. విద్యా శాఖ చేసిన ట్వీట్‌ను ప్రధాని ట్వీట్ మోదీ ట్యాగ్ చేసి “పరీక్ష పే చర్చ 2023కి సంబంధించిన ఈ ఆసక్తికరమైన కార్యకలాపాలలో పాల్గొనాలని నేను పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు/ఎగ్జామ్ వారియర్స్, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులందరికీ పిలుపునిస్తున్నాను. మన విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించేందుకు సమిష్టిగా కృషి చేద్దాం” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 8 =