దేశంలో కూడా ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలుపుదల

AstraZeneca-Oxford Coronavirus Vaccine, Oxford, Oxford Covid Vaccine News, Oxford COVID-19 Vaccine, Oxford COVID-19 Vaccine Trials, Oxford COVID-19 Vaccine Trials are Successful, Oxford-Astrazeneca COVID-19 vaccine, Oxford-Astrazeneca COVID-19 vaccine update, Phase 1 and 2 of Oxford COVID-19 Vaccine, Serum Institute Halts Clinical Trials in India

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, వ్యాక్సిన్‌ పై మరోసారి సమీక్ష నిర్వహించేందుకుచివరి దశలో ఉన్న క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ వెల్లడించింది. మరోవైపు గతంలోనే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండు మరియు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ ను దేశంలో‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది.

అయితే ప్రస్తుతం భారత్ లో కూడా ఈ కరోనా‌ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ తాజాగా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ పై ఆస్ట్రాజెనికా తిరిగి ట్రయల్స్ ప్రారంభించేంత భారత్ లో కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అంశంలో డీసీజీఐ సూచనలను అనుసరిస్తున్నామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. అయితే దేశంలో ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ తో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ లో ఎలాంటి ఇబ్బందికర ఫలితాలు ఎదుర్కోలేదని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here