జంట పేలుళ్ల నేపథ్యంలో జమ్మూలో హై అలర్ట్.. రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతుందని ప్రకటించిన కాంగ్రెస్

High Alert Declared in Jammu After 6 Injured in Twin Blasts at Narwal Congress Announces Rahul Gandhi's Jodo Yatra Will Continue,High Alert Declared in Jammu, 6 Injured in Twin Blasts,Congress Announces Rahul Gandhi's Jodo Yatra,Rahul Gandhi's Jodo Yatra Will Continue,Mango News,Mango News Telugu,Bharat Jodo Yatra,Priyanka Gandhi Participate In Rahul's Yatra, Bharat Jodo Yatra Madhya Pradesh, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, Inc Latest News And Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress President Mallikarjun

శనివారం ఉదయం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూలో జరిగిన జంట పేలుళ్లలో ఆరుగురు గాయపడ్డారు. జమ్మూలోని నార్వాల్ ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ పేర్కొన్నారు. పేలుళ్ల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి భద్రతను కట్టుదిట్టం చేశామని, సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ ఘటనపై స్పందించిన జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేలుళ్లను ఖండించారు. పేలుళ్లలో గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో పాద యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మూలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు రాహుల్ యాత్ర కొనసాగే మార్గాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రసుతం రాహుల్ యాత్ర ఇక్కడి నుండి 60 కి.మీల దూరంలో ఉన్న చడ్వాల్ వద్ద విరామంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని, రాహుల్ యాత్రను కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారని ప్రకటించింది. కాగా జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగియనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here