ఢిల్లీలో ప్రధాని మోదీతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భేటీ

Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu Called on PM Narendra Modi Today at Delhi,Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu,CM Sukhvinder Singh Sukhu,Sukhvinder Singh Sukhu Called on PM Narendra Modi,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, రాష్ట్రంలో అమలులో ఉన్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధుల సహకారం అందించాలని ప్రధాని మోదీకి సీఎం సుఖ్వీందర్ సింగ్ సఖు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

మౌలిక సదుపాయాలను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి గతి శక్తి యోజన, రోప్‌వేల నిర్మాణం కోసం పర్వతమాల యోజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని ప్రధానికి సీఎం సుఖ్వీందర్ సింగ్ సఖు హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సుఖ్వీందర్ సింగ్ సఖు సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరియు ఉప రాష్ట్రపతి నివాస్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కూడా కలిశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here