టీ20 ప్రపంచకప్-2022: 15 మందితో శ్రీలంక జట్టు ప్రకటన

ICC Mens T20 World Cup 2022 Sri Lanka Announced 15 Member Squad, ICC Men's T20 World Cup, T20 World Cup 2022,Srilanka T20 World Cup Team, T20 World Cup Srilanka Team, Mango News , Mango News Telugu, Srilanka 15 member Squad, Dasun Shanaka (c), Danushka Gunathilaka, Pathum Nissanka, Kusal Mendis, Charith Asalanka, Bhanuka Rajapaksa, Dhananjaya de Silva, Wanindu Hasaranga, Maheesh Theekshana, Jeffrey Vandersay, Chamika Karunaratne, Dushmantha Chameera (Subject to fitness), Lahiru Kumara (Subject to fitness), Dilshan Madushanka, Pramod Madushan.

టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగనుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ లో ఆడే తమ జట్లను ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంక కూడా టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును వెల్లడించింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాతో పాటుగా ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లను కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. శ్రీలంక జట్టుకు దసున్ షనక కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో దుష్మంత చమీర మరియు లహిరు కుమారలకు కూడా చోటు కల్పించగా, అయితే వారి పార్టిసిపేషన్ టోర్నమెంట్‌కు ముందు వారి ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుందని తెలిపారు.

ఇక స్టాండ్‌బై ఆటగాళ్లుగా అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో మరియు నువానీడు ఫెర్నాండోలను ప్రకటించారు. అయితే వీరిలో అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ మాత్రమే జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఆసియా కప్-2022 లో శ్రీలంక అద్భుత ప్రదర్శనతో సమిష్టిగా పోరాడి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆసియా కప్ లో జట్టులో ఆడిన చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ కు ఎంపికయ్యారు. కాగా ఆసియా కప్‌లో అరంగేట్రం చేసిన మతీషా పతిరానాకు తాజా జట్టులో చోటు దక్కలేదు.

టీ20 ప్రపంచకప్-2022 కోసం శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్.

స్టాండ్‌బై ప్లేయర్స్: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమల్, బినుర ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 11 =