రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్‌ వేసిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని మోదీ

Presidential Elections-2022 NDA Candidate Draupadi Murmu Files Nomination PM Modi Attends, NDA Candidate Draupadi Murmu Files Nomination PM Modi Attends, NDA Candidate Draupadi Murmu Files Nomination, PM Modi Attends For NDA Candidate Draupadi Murmu Files Nomination, Draupadi Murmu Files Nomination, NDA Candidate Files Nomination, NDA Candidate Draupadi Murmu, Draupadi Murmu, NDA Candidate, Presidential Elections-2022, 2022 Presidential Elections, Presidential Elections, Nomination, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Presidential Elections-2022 News, Presidential Elections-2022 Latest News, Presidential Elections-2022 Latest Updates, Presidential Elections-2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఎన్డీయే కూటమి అభ్యర్థి ‘ద్రౌపది ముర్ము’ నేడు రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్‌ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేబినెట్‌ మంత్రుల సమక్షంలో ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. దీనికి బీజేపీ పాలిట రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం విచ్చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ తదితరులు నామినేషన్ ఘట్టానికి సాక్షులుగా నిలిచారు. ఈ క్రమంలో ముందుగా ముర్ము పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు.

కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ముర్ము దాఖలు చేశారు. మరోవైపు ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి అధికార వైసీపీ తరపున ఎంపీలు విజయసాయి రెడ్డి మరియు మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఒడిశాకు చెందిన ముర్ము రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేడీ-బీజేపీ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. తాజాగా బీజేపీ అధిష్టానం రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 12 =