పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన ఇమ్రాన్ ఖాన్.. మరో మూడు నెలల్లో ఎన్నికలు?

Imran Khan Denotified As Prime Minister After Parliament Dissolved in Pakistan, Imran Khan Denotified As Prime Minister, Prime Minister Imran Khan Denotified, Pakistan Prime Minister Imran Khan Denotified, Pakistan Prime Minister Imran Khan, Pakistan Prime Minister, Prime Minister Imran Khan, Imran Khan, Pakistan, Imran Khan Denotified As Prime Minister After Parliament Dissolved, Parliament Dissolved in Pakistan, Imran Khan denotified as Pakistan Prime Minister, Imran Khan Prime Minister of Pakistan, Prime Minister of Pakistan, Mango News, Mango News Telugu,

పాకిస్థాన్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సూరి అనూహ్యంగా దీనిని తోసిపుచ్చారు. నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ఏ తీర్మానాన్ని కొట్టివేశారు. అనంతరం ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నానని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలోకి నెట్టారు. ఈమేరకు దేశాధ్యక్షుడికి సిఫార్సు చేశారు. దీనిపై వెంటనే అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. దీంతో ప్రతిపక్షాలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయింది. అసలు ఎం జరుగుతుందో వారికి అర్ధమయ్యేలోపే మొత్తం వ్యవహారం ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా మారిపోయింది. త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌ యోచిస్తున్నారు. ప్రజలలో మంచి ఇమేజ్ ఉన్నందున ఇమ్రాన్ ఖాన్‌కు మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో డీ-నోటిఫికేషన్ వచ్చింది. అకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ప్రధానిగా డినోటిఫై చేసినట్లు ఒక అధికారిక ఉత్తర్వు వెలువడింది. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చిన తర్వాత డీనోటిఫికేషన్ జరిగింది. ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురై, జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ ప్రతిపక్షాలు తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాయి. ఇమ్రాన్ ఖాన్ మరియు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్ ప్రస్తుత ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం ఖచ్చితంగా విచారించబడతారని నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్ చెప్పారు.

అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుకి వ్యతిరేకంగా ప్రతిపక్షం చట్టపరమైన పోరాటం ప్రారంభిస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ‌ఖాన్‌ పైన అవిశ్వాస తీర్మానం కొట్టివేసిన తర్వాత, ప్రస్తుత రాజకీయాలలో తమ ప్రమేయం లేదని పాక్ ఆర్మీ ప్రకటించింది. డిప్యూటీ స్పీకర్ సూరి, ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేసిన తరువాత సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ బండియాల్ ఒక కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ లో ప్రభుత్వం రద్దైన కారణంగా.. మరో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ దేశంలోని అన్ని వ్యవస్థలు ఇకపై సుప్రీంకోర్ట్ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. ఆపద్ధర్మ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కూడా ఏదేని విచారణలో సుప్రీంకోర్టుకు సర్వాధికారాలు ఉంటాయని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =