శ్రీలంక సంక్షోభం: 26 మంది కేబినెట్ మంత్రుల రాజీనామా, ప్రధానిగా కొనసాగనున్న మహిందా రాజపక్సే

Sri Lanka Crisis All 26 Ministers Resigned But Mahinda Rajapaksa To Remain PM, Sri Lanka Crisis, All 26 Ministers Resigned But Mahinda Rajapaksa To Remain PM, Mahinda Rajapaksa To Remain PM, PM Mahinda Rajapaksa, Mahinda Rajapaksa, Sri Lankan Cabinet Ministers Submit Mass Resignation Amid Economic Crisis, Sri Lankan Cabinet Ministers Submit Mass Resignation, Sri Lankan Economic Crisis, Economic Crisis, Sri Lanka's Cabinet of Ministers resigned on the 4th of April, Sri Lanka's Cabinet of Ministers resigned To amid the ongoing economic crisis in the nation, 26 ministers, Sri Lankan 26 ministers Cabinet Ministers Submit Mass Resignation, Sri Lankan 26 ministers Cabinet Ministers Submit Mass Resignation Amid Economic Crisis, Sri Lankan 26 ministers Cabinet Ministers, 26 ministers Mass Resignation, ministers Mass Resignation, Sri Lanka witnessed the worst economic crisis in the history of the nation, Sri Lanka Economic Crisis Latest News, Sri Lanka Economic Crisis Latest Updates, Mango News, Mango News Telugu,

సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక మంత్రివర్గం ఆదివారం అర్థరాత్రి జరిగిన సమావేశంలో తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసింది. అయితే, మహింద రాజపక్సే ప్రధానిగా కొనసాగుతారు. మొత్తం 26 మంది కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. మహింద రాజపక్సే రాజీనామాకు సంబంధించిన నివేదికలను ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే యొక్క పెద్ద కుమారుడు నమల్ రాజపక్సే కూడా రాజీనామా చేయటం విశేషం. ఆయన కేబినెట్ లో యువజన మరియు క్రీడల మంత్రిగా ఉన్నారు. నిన్న ఉదయం, ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెరదేనియా విశ్వవిద్యాలయం వెలుపల నిరసనకు దిగారు.

అయితే ప్రభుత్వం నిరసనలను అడ్డుకోవటానికి విధించిన వారాంతపు కర్ఫ్యూను విధించింది. అయినప్పటికీ దీనిని ధిక్కరిస్తూ వేలమంది నిరసనకారులు రోడ్లపైకి చేరుకుంటున్నారు. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ మరియు వాటర్ ఫిరంగిని ఉపయోగిస్తున్నారు. రాజధాని కొలంబోలో ప్రతిపక్ష నాయకులు చేపట్టిన మార్చ్‌లో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస ఇంటి దగ్గర గుమికూడిన ఆందోళనకారులను పోలీసులు మరియు సైనికులు అడ్డుకున్నారు. కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 664 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కఠినమైన చట్టాలు మిలిటరీని విచారణ లేకుండానే అనుమానితులను ఎక్కువ కాలం అరెస్టు చేయడానికి మరియు నిర్బంధించడానికి అనుమతిస్తాయని, ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితి అవసరమని ప్రధాని రాజపక్సే పేర్కొన్నారు.

ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సేకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణిచివేసేందుకు శ్రీలంక ప్రభుత్వం శనివారం నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు యూట్యూబ్‌తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేసింది. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి ఇంత దారుణమైన పరిస్థితులను ఎన్నడూ చూడలేదని దేశప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే కోవిడ్-19 మహమ్మారి కారణంగా కీలకమైన శ్రీలంక పర్యాటకం దెబ్బతింది. పులిమీద పుట్రలా ఇప్పుడు తీవ్ర ఆర్ధిక సంక్షోభం లంకేయులను వణికిస్తోంది. ప్రపంచదేశాలు తమను సత్వరమే ఆదుకోవాలని శ్రీలంక విజ్ఞప్తులు చేస్తోంది. భారత్ కూడా దీనిపై స్పందించింది. ఇంధన ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు తదితర ముఖ్య అవసరాలను గుర్తించి లంకకు సహాయం అందిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =