2 నిమిషాల్లో ఈ-పాన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

E PAN Can Be Downloaded In 2 Minutes, In 2 Minutes E PAN Can Be Downloaded, PAN Card Download, E PAN, Need PAN Card Urgently, E PAN Can Be Downloaded, Latest Pan Card Dowload Tips, Pan Card Download Tips, Easy Way To Download Pan Card, Pan Card Details, KYC, Pan Card Linking, Pan Mobile Linking, Mango News, Mango News Telugu
E PAN ,Need PAN card urgently,E-PAN can be downloaded ,

ప్రతి ఒక్కరికి పాన్‌ కార్డ్‌ ఎంత అవసరంగా మారిందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే రూ. 50 వేలు దాటిన ప్రతీ ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఉండాలి. అందుకే ఆధార్‌ కార్డ్‌ తర్వాత అత్యంత ముఖ్యమైన కార్డు ఏమైనా ఉందా అంటే అది పాన్‌ కార్డ్‌ ఒకటి అనే చెబుతారు.ఇండియాలో  ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి మధ్య మనీ ట్రాన్జాక్షన్స్ ఉన్నా..సంస్థల మధ్య ట్రాన్జాక్షన్స్ జరగాలన్నా కూడా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు అవసరం. అంతెందుకు బ్యాంకుల్లో ఒకేసారి రూ.50 వేల నగదు డిపాజిట్‌ చేయాలన్నా, ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలన్నా పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే.

అయితే పాన్ కార్డ్‌ను అప్లై చేసుకున్న తర్వాత కనీసం రెండు వారాల దాటాకే పాన్‌ కార్డు చేతికి అందుతుంది. కొన్నికొన్ని సందర్భాల్లో నెల రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ పాన్ కార్డ్‌ను క్షణాల్లో ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియదు. పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఈ-పాన్‌ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు సాధారణ పాన్ కార్డులాగే దీన్ని  అన్ని ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు.

ఈ-పాన్‌ కార్డును  డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ముందుగా ఆధార్ కార్డును కూడా దగ్గర పెట్టుకోవలి. తర్వాత ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.తర్వాత స్క్రీన్‌కి లెఫ్ట్‌ సైడ్‌ కనిపించే.. ఆప్షన్స్‌లో ‘ఇన్ స్టంట్ ఈ-పాన్ ‘ బటన్ పై క్లిక్ చేయగానే. గెట్‌ న్యూ పాన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకుని ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, చెక్ బాక్స్ పై టిక్ చేసి  దానిపై క్లిక్ చేసి కంటిన్యూ బటన్‌ను నొక్కాలి. వెంటనే మీ రిజిస్టర్ ఫోన్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి కంటిన్యూ నొక్కాలి.ఆ తర్వాత  వివరాలను చెక్‌ చేసి టర్మ్స్‌ను యాక్సెప్ట్ చేస్తూ చెక్‌ బాక్స్‌పై టిక్ చేయాలి. దీంతో ఇన్‌స్టాంట్‌గా ఈ-పాన్‌ కార్డ్‌ వస్తుంది. దీనిని పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 13 =