ఇండియా-ఆస్ట్రేలియా 2వ టెస్టు: పలు రికార్డులు సాధించిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా

Ind Vs Aus 2nd Test Day 1 Spin Twins Ravichandran Ashwin and Ravindra Jadeja Achieve Huge Milestones in Delhi,Border Gavaskar Trophy 2023,Border Gavaskar Trophy Series,Border Gavaskar Trophy History,Mango News,Mango News Telugu,Border Gavaskar Trophy Squad,Border Gavaskar Trophy Movie,Border Gavaskar Trophy Wiki,Border Gavaskar Trophy Streaming,Border Gavaskar Trophy 2023 Venue,Border-Gavaskar Trophy 2023,Border-Gavaskar Trophy Series,Border-Gavaskar Trophy History,Border-Gavaskar Trophy Squad,Border-Gavaskar Trophy Winners List,Border-Gavaskar Trophy Schedule,Border Gavaskar Trophy,Border Gavaskar Trophy 2018,Border Gavaskar Trophy 2020-21,Border Gavaskar Trophy Winners List,Border Gavaskar Trophy 2014,Border Gavaskar Trophy Documentary,Border Gavaskar Trophy 2001,Border Gavaskar Trophy 2017,Border Gavaskar Trophy 2021 Scorecard,Next Border Gavaskar Trophy,2001 Border Gavaskar Trophy,Ind Vs Aus Border Gavaskar Trophy 2020,2004 Border Gavaskar Trophy,Most Runs In Border Gavaskar Trophy

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తలపడుతోంది. టీమిండియా కీలక ఆటగాడు, నయా వాల్ గా పేరొందిన ఛటేశ్వర్ పుజారాకు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆట ప్రారంభానికి ముందు భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేతులమీదుగా ప్రత్యేక క్యాప్ అందుకున్నాడు. ఈ క్రమంలో పుజారా ఈ టెస్టులో సెంచరీ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ తో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజాలు తొలిరోజు ఆటలో సరికొత్త రికార్డులు సాధించారు. ఈ ఇద్దరూ తొలి టెస్టు మాదిరిగానే మరోసారి ఆసీస్ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించారు. దీంతో రెండో టెస్టులో కూడా ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఆ జట్టు బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించలేకపోయారు. వీరిరువురూ అర్ధసెంచరీలు చేశారు. పేసర్ మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, జడేజాలు చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 21/0తో తొలిరోజు ఆటను ముగించింది. కాగా బీసీసీఐ కూడా అశ్విన్, జడేజాలు సాధించిన రికార్డుల పట్ల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపింది.

రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు..

  • ఆస్ట్రేలియాపై 100 వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు.
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా కలుపుకుని మొత్తం 700 వికెట్లు దక్కించుకున్న బౌలర్‌గా అవతరించాడు.
  • ఆసీస్ కీలక బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్ ను రెండుసార్లు డకౌట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు.
  • ఇప్పటివరకు 9 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లను దక్కించుకున్నాడు.
  • మరో మూడు దక్కించుకుంటే శ్రీలంక దిగ్గజం మురళీధరన్ (11) రికార్డును అధిగమిస్తాడు.
  • అలాగే ప్రస్తుతం 460 వికెట్లు తీసిన అశ్విన్.. మరో రెండు వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ (461)ను అధిగమిస్తాడు.

రవీంద్ర జడేజా రికార్డులు..

  • ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడం ద్వారా 250వ టెస్టు వికెట్‌ని కైవసం చేసుకున్నాడు.
  • తద్వారా కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ మరియు అశ్విన్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనతను పూర్తి చేసిన ఐదవ భారతీయుడు అయ్యాడు.
  • అంతేకాకుండా అత్యంత వేగంగా 2500 పరుగులు మరియు 250 వికెట్లు సాధించిన భారతీయుడుగా నిలిచాడు.
  • అంతకుముందు టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు, 2500 పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కపిల్‌దేవ్‌ ఉన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 5 =