తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu Today Called Telangana CM KCR over Phone to Extend Birthday Greetings,President Draupadi Murmu,Wished Telangana CM KCR,CM KCR Birthday,Mango News,Mango News Telugu,CM KCR 69th Birthday,Telangana CM KCR,CM KCR's Birthday,CM KCR's birthday tomorrow,Many service programs,BRS leaders across Telangana,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు సీఎం కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంతో పాటుగా అన్ని జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here