ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన ప్రతిభావంతులకు ప్రధాని మోదీ అభినందనలు

PM Modi Congratulates Talented Youngsters who have been Conferred the Ustad Bismillah Khan Yuva Puraskar,Prime Minister Modi congratulated,talented youth,Ustad Bismillah Khan Yuva Award,Mango News,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన ప్రతిభావంతులైన యువకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సంగీత నాటక అకాడమీ చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందిస్తూ, “ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన ప్రతిభావంతులైన యువకులకు అభినందనలు. వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. వారు రాబోయే కాలంలో భారతీయ సంస్కృతి మరియు సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి” అని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌ లోని మేఘదూత్ థియేటర్ కాంప్లెక్స్‌లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2019, 2020 మరియు 2021 లను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా పురేచా అధ్యక్షత వహించారు. సంగీత నాటక అకాడమీ అనేది సంగీతం, నృత్యం మరియు నాటకాల జాతీయ అకాడమీ మరియు దేశంలోని ప్రదర్శన కళల యొక్క అత్యున్నత సంస్థ.

2022, నవంబర్ 8న న్యూఢిల్లీలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2019, 2020, 2021 కోసం వారి వారి రంగాల్లో యువ ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకున్న 102 మంది కళాకారులను (మూడు ఉమ్మడి అవార్డులతో సహా) ఎంపిక చేశారు. 2019 సంవత్సరానికి గాను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీతల చేత ప్రదర్శించబడే సంగీతం, నృత్యం మరియు నాటకాల యొక్క నాలుగు రోజుల ఉత్సవం 2023 ఫిబ్రవరి 14-17 వరకు న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌లోని మేఘదూత్ థియేటర్ కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతుంది. ఈ అవార్డులను అందజేస్తూ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించబడిన కళాకారులందరికీ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. కళలను ప్రోత్సహించడం, ప్రోమోట్ చేయడం దేశ సంప్రదాయమని ఆయన అన్నారు. భారతదేశం నుండి కళను విడదీయలేమని అన్నారు. కళాకారులు తమ కళలను రేపటి తరానికి తీసుకెళ్లేందుకు గొప్పగా కృషి చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం, 40 సంవత్సరాల వయస్సు వరకు కళాకారులకు ఇవ్వబడుతుంది. ఇది విభిన్న ప్రదర్శన కళల రంగాలలో అత్యుత్తమ యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం మరియు వారి జీవితంలో ప్రారంభంలో వారికి జాతీయ గుర్తింపును అందించాలనే లక్ష్యంతో 2006 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. తద్వారా వారు ఎంచుకున్న రంగాలలో ఎక్కువ నిబద్ధత మరియు అంకితభావంతో పని చేసేందుకు ప్రోత్సహకంగా ఉంటుందన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం కింద రూ.25,000 నగదు, ఫలకాన్ని అందిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 17 =