ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య తొలి వన్డే నేడు.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం

Ind vs Eng 1st ODI Team India Star Batsman Virat Kohli Likely To Miss Today's Match Due to Groins Injury, Team India Star Batsman Virat Kohli Likely To Miss Today's Match Due to Groins Injury, Virat Kohli Likely To Miss Today's Match Due to Groins Injury, Team India Star Batsman Likely To Miss Today's Match Due to Groins Injury, Virat Kohli Likely To Miss Today's Match, Groins Injury, Ind vs Eng 1st ODI, Team India Star Batsman Virat Kohli likely to miss 1st ODI against England due to suspected groin injury, Kohli likely to miss 1st ODI against England due to suspected groin injury, 1st ODI against England, Team India Star Batsman Virat Kohli, Star Batsman Virat Kohli, Virat Kohli, Ind vs Eng 1st ODI News, Ind vs Eng 1st ODI Latest News, Ind vs Eng 1st ODI Latest Updates, Ind vs Eng 1st ODI Live Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో గెలుచుచుకున్న భారత్‌ ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా మంగళవారం తొలి వన్డే ఆడనుంది. వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్‌శర్మ నేతృత్వంలోని టీమిండియా భావిస్తుండగా టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. కాగా టీమిండియా స్టార్ బ్యాట్సమన్ విరాట్ కోహ్లీ ఈ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా ఉంది. గజ్జల్లో గాయం కారణంగా కోహ్లీ నేటి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా కోహ్లీ పరుగులు సాధించడంలో విఫలమవుతున్నాడు. టీ20 సిరీస్‌లో కూడా పరుగులు చేయలేకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌లో అయినా పరుగులు సాధిస్తాడని భావించిన అభిమానులను గాయం కారణంగా విరాట్ నేటి మ్యాచ్‌కు దూరమవడం షాక్ కి గురి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లు టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయనున్నారు. ఇటీవలి కాలంలో ధవన్‌కు సరైన అవకాశాలు లేకపోవడం కారణంగా చాలాకాలం తర్వాత ఈ జోడీ కలిసి బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఈ జోడీ ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. వీరిద్దరు మరో ఆరు పరుగులు జోడిస్తే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో జోడీగా రికార్డుల్లోకెక్కనున్నారు. మరోవైపు బెన్ స్టోక్స్‌, జో రూట్‌, బెయిర్‌ స్టో రాకతో ఇంగ్లండ్‌ బలం పెరిగింది. ఇయాన్ మోర్గాన్‌ నుంచి కెప్టెన్సీ అందుకున్న తర్వాత తొలిసారి బట్లర్‌ వన్డేల్లో నాయకత్వం వహిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం 5:30 గం. లకు మ్యాచ్ జరుగనుంది.

తుది జట్లు అంచనా..

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రైగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, ఫిల్ సాల్ట్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 6 =