డియోఘర్ ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ, 16,800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

Prime Minister Narendra Modi Inaugurated the 657-acre Deoghar airport, PM Narendra Modi Inaugurates Deoghar Airport Today, Narendra Modi Inaugurates Deoghar Airport Today, PM Modi Inaugurates Deoghar Airport Today, Modi Inaugurates Deoghar Airport Today, Narendra Modi Launches Deoghar Airport Today, PM Modi Starts Deoghar Airport Today, Modi Inaugurated Deoghar Airport Today, Deoghar Airport Inauguration, Inauguration Of Deoghar Airport, Deoghar Airport, Deoghar Airport News, Deoghar Airport Latest News, Deoghar Airport Latest Updates, Deoghar Airport Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేడు (జూలై 12, మంగళవారం) జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘ‌ర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డియోఘర్ విమానాశ్రయం సహా రూ.16,800 కోట్ల కంటే ఎక్కువ విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ రోజు రూ.16,800 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయని, ఇవి జార్ఖండ్ యొక్క ఆధునిక కనెక్టివిటీ, ఎనర్జీ, ఆరోగ్యం, విశ్వాసం మరియు పర్యాటక రంగానికి భారీ ఊపును ఇవ్వబోతున్నాయని అన్నారు. అలాగే జార్ఖండ్ కు మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్టులు బీహార్, పశ్చిమ బెంగాల్‌ లోని అనేక ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. ఈరోజు డియోఘర్ విమానాశ్రయం ప్రారంభంతో జార్ఖండ్‌లో రెండో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఇది బాబా బైద్యనాథ్ భక్తులకు విపరీతమైన సౌలభ్యాన్ని కలిగిస్తుందన్నారు. ఉడాన్ ప‌థ‌కం ద్వారా సామాన్యుల‌కు విమాన ప్ర‌యాణాన్ని అందుబాటులోకి తెచ్చిన సంద‌ర్భంలో, ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల ప్ర‌యోజ‌నాలు ఈ రోజు దేశ‌మంతటా క‌నిపిస్తున్నాయ‌ని ప్రధాని పేర్కొన్నారు. ఉడాన్ పథకం కింద గత 5-6 సంవత్సరాలలో విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు మరియు వాటర్ ఏరోడ్రోమ్‌ల ద్వారా దాదాపు 70 కొత్త ప్రదేశాలు జోడించబడ్డాయని తెలిపారు.

డియోఘర్ నుంచి కోల్‌కతాకు ఈరోజు విమానం ప్రారంభం కాగా, రాంచీ, ఢిల్లీ, పాట్నాలకు త్వరలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. బొకారో మరియు దుమ్కాలో విమానాశ్రయాల కోసం పనులు జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా అత్యుత్తమ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా, డియోఘర్‌లోని ఎయిమ్స్ లో ఇన్-పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఐపీడీ) మరియు ఆపరేషన్ థియేటర్ సేవలు ప్రారంభించినట్టు తెలిపారు. అలాగే రూ.10,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ రహదారి ప్రాజెక్టులకు కూడా ప్రధాన మోదీ ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =