భారత్ vs ఇంగ్లాండ్ ఐదో టెస్ట్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, భారత్ తుది జట్టు ఇదే…

IND vs ENG 5th Test England Won the Toss and Opted to Field, England Won the Toss and Opted to Field, IND vs ENG 5th Test, IND vs ENG 5th Test England Won the Toss, IND vs ENG 5th Test England Opted to Field, England captain Ben Stokes won the toss and opted to bowl in the rescheduled fifth Test against India at Edgbaston Birmingham, rescheduled fifth Test against India at Edgbaston Birmingham, England captain Ben Stokes won the toss and opted to bowl in the rescheduled fifth Test against India, England captain Ben Stokes won the toss, England captain Ben Stokes, captain Ben Stokes, England captain, Ben Stokes, IND vs ENG 5th Test News, IND vs ENG 5th Test Latest News, IND vs ENG 5th Test Latest Updates, IND vs ENG 5th Test Live Updates, Mango News, Mango News Telugu,

ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టులో ఛటేశ్వర్ పుజారా, శుభమన్ గిల్ తో కలిసి ఓపెనర్‌ గా బరిలోకి దిగాడు. అలాగే మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లతో బౌలింగ్ కాంబినేషన్ సమకూర్చగా, ఆల్ రౌండర్ గా జడేజా తుదిజట్టులో ఉన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ తుది జట్టులోకి బెన్ ఫోక్స్, జామీ ఓవర్టన్ స్థానంలో జేమ్స్ ఆండర్సన్, సామ్ బిల్లింగ్స్ వచ్చినట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మకమైన ఈ 5వ టెస్టులో భారత్ జట్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ గా తేలడంతో భారత్ టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. తోలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతానికి రెండు వికెట్స్ కోల్పోయి 53 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (1), హనుమ విహారి (14) పరుగులతో క్రీజులో ఉండగా, ఛటేశ్వర్ పుజారా 13, శుభమన్ గిల్ 17 పరుగులకు పెవిలియన్ బాట పట్టారు.

భారత్ జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్) శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here