తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సెంచరీతో మెరిసిన లాథమ్, రాణించిన విలియమ్సన్

Ind vs NZ 1st ODI Latham and Williamson Shines with Bat in New Zealand's Massive Win Against Team India,New Zealand Won Over India, New Zealand Vs India First Odi, Latham Shone Century,Kane Williamson Excelled,Mango News,Mango News Telugu,New Zealand Vs India, India Won The Series 1-0,India Win The Series 1-0,Napier Stadium,Nz Vs Ind,India Cricket Team,Newzealand Cricket Team,Indian Team Captain Hardik Pandya,Hardik Pandya,Newzealand Team Captain Kane Williamson,Kane Williamson,Ind Vs Nz Latest News And Updates

మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథ‌మ్ అజేయ సెంచరీతో (145) తుదికంటా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94 నాటౌట్) అద్భుత సహకారం అందించాడు. దీంతో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెన‌ర్లు కెప్టెన్ శిఖ‌ర్ ధవ‌న్‌ (72), శుభ‌మ‌న్ గిల్ (50) తొలి వికెట్‌కు 124 ర‌న్స్ జోడించి శుభారంభం అందించారు. అయితే వీరి తర్వాత పంత్‌, సూర్య‌కుమార్, సంజూ సాంస‌న్ భారీ స్కోర్లు చేయలేకపోయారు.

ఈ సమయంలో శ్రేయాస్ అయ్య‌ర్ 80 పరుగులు చేయగా.. ఆఖర్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక కివీస్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూస‌న్‌లు మూడేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం 307 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఓపెనర్లు ఫిన్ అలెన్ (21,) డెవాన్ కాన్వే (24), అనంతరం డారిల్ మిచెల్ (11), స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 88 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో మిడిలార్డర్ బ్యాటర్స్ కెప్టెన్ టామ్ లాథమ్ మరియు కేన్ విలియమ్సన్ లు భారత్ బౌలర్లను ఎదుర్కొంటూ నాలుగో వికెట్ కు 221 పరుగుల అద్భుత భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో లాథమ్ బరి సెంచరీ నమోదు చేసాడు. విలియమ్సన్ కూడా 94 పరుగులతో నాటౌట్ గా నిలిచి అతడికి మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా 47.1 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − two =