రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై నారా లోకేష్ కీలక ప్రకటన, జనవరి 27 నుంచి ప్రారంభిస్తానని వెల్లడి

Tdp Leader Nara Lokesh Announces He Will Start Padayatra From January 27th Across The State,Tdp Leader Nara Lokesh,Nara Lokesh Padayatra,Lokesh Padayatra From January 27th,Mango News,Mango News Telugu,Nara Lokesh,Nara Lokesh Latest News And Updates,Tdp Leader Nara Lokesh Pada Yatra,Tdp Leader Nara Lokesh News and Live Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్రపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2023, జనవరి 27వ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నట్టు నారా లోకేష్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలో నూతక్కి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడుతూ తన పాదయాత్రపై నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. సుమారుగా 400 రోజుల పాటుగా రాష్ట్రంలో మొత్తం 4వేల కిలోమీటర్లు మేర తన పాదయాత్ర కొనసాగనున్నట్టు లోకేష్ తెలిపారు.

మంగళగిరి నియోజకర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుందని, మిగతా 396 రోజులు రాష్ట్రమంతా వెళ్లాల్సి ఉంటుందని, దీంతో మంగళగిరిని కాపు కాసే బాధ్యతను స్థానిక నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. అలాగే తనని మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని నాయకులకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్నట్టు తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 5 =