యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

India Bans UK Flights Temporarily Over New COVID-19 Virus Strain,Covid,UK Covid Strain,New Covid Strain In UK,UK COVID,UK Covid Mutation,Britain Covid,Corona Updates,India Banned Flights From UK,COVID-19 New Strain,COVID-19 New Strain UK,COVID-19 New Strain Symptoms,COVID-19 New Strain In London,COVID-19 New Strain England,COVID-19 New Strain Of Coronavirus,New COVID-19 Virus Strain,Coronavirus,COVID-19,Vaccine,COVID Update,UK Flights Banned,Mango News,Mango News Telugu,UK Countrie Ban Flights,New COVID strain,New Coronavirus Strain,India Bans UK Flights Temporarily,India Bans Flights From UK Amid Fears Of New COVID-19 Variant Spread,India Halts UK Flights,Coronavirus India Live Updates,UK Flights Temporarily Suspended

యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)‌ లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించగా తాజాగా ఆ జాబితాలోకి భారత్ కూడా చేరింది. డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11.59 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 31 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌కు అనుమ‌తి లేదని కేంద్ర విమానయాన శాఖ వెల్ల‌డించింది. మరోవైపు డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు యూకే నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం సూచించింది.

ముందుగా యూకేలో ఇంతకు ముందు కరోనా వ్యాప్తితో పోల్చుకుంటే కొత్తరకం కరోనా వైరస్ (వీయూఐ-202012/01)‌‌ 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పలు దేశాలు విమాన ప్రయాణాలపై నిషేధం విధించాయి. నెదర్లాండ్‌, బెల్జియం, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బెల్జియం, కెన‌డా, ఇటలీ, అర్జెంటినా, కొలంబియా, చిలీ, సౌదీ అరేబియా, ఐర్లాండ్, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలు నిషేధం విధించగా, మరికొన్ని దేశాలు యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నియమాలు అమల్లోకి తెచ్చారు. మరోవైపు యూకేలో కొత్త రకం కరోనా వ్యాప్తి పరిణామాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించడానికి భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నాడు కోవిడ్‌-19 జాయింట్ మానిటరింగ్‌ గ్రూప్‌(జేఎంజీ) తో అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =