కరోనా వ్యాప్తి: లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాలు జాబితా ఇదే…

Corona Outbreak, Coronavirus Lockdown, Coronavirus Lockdown News, Coronavirus Lockdown States, Coronavirus Lockdown States List, Coronavirus Lockdown Updates, List of States Which are Implementing Lockdown

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా కరోనా కేసులు నమోదతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 34956 కరోనా పాజిటివ్ కేసులు, 687 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో జూలై 17, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10,03,832 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో జూలై 31 వరకు దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్స్ లో లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనా పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్రాలు మళ్ళీ లాక్‌డౌన్ ను విధిస్తున్నాయి. పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతుండడంతో కొన్ని సడలింపులతో కీలక నగరాల్లో లాక్‌డౌన్ విధింపుకే రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి.

దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్ ను విధించిన రాష్ట్రాలు:

  • బీహార్ – జూలై 16 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్
  • పశ్చిమ బెంగాల్ – సడలింపులతో జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
  • కర్ణాటక – బెంగుళూరు రూరల్, అర్బన్ జిల్లాలలో జూలై 14 నుంచి జూలై 22 వరకు లాక్‌డౌన్
  • మహారాష్ట్ర – సడలింపులతో జూలై 31 వరకు పొడిగింపు. పుణేలో జూలై 13 నుంచి పది రోజుల పాటు జూలై 23 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్
  • ఒడిశా – నాలుగు జిల్లాల్లో జూలై 17 నుంచి జూలై 31 వరకు లాక్‌డౌన్
  • ‌జార్ఖండ్ – జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
  • ఉత్తరప్రదేశ్ – వీకెండ్స్ లో లాక్‌డౌన్
  • కేరళ – తిరువనంతపురంలో జూలై 23 వరకు లాక్‌డౌన్
  • ఆంధ్రప్రదేశ్ – కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =