మీ ఆధార్ నెంబర్‌తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా..?

Do You Know How To Find SIM Cards Linked To Your Aadhaar Card,Do You Know How To Find SIM Cards,Find SIM Cards Linked To Your Aadhaar Card,How To Find SIM Cards,Mango News,Mango News Telugu,Aadhaar number, SIM cards, How many sim cards are on your aadhaar card, Your Mobile Connection, Mobile,Multiple SIM Cards Linked,Check the number of SIM cards issued,Check How many Sim Cards Registered,Massive Aadhaar SIM Fraud Detected,SIM Cards Link

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ వ్యవహారాలు నడిపే వారంతా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త కొత్త సాంకేతికతతో ఆన్‌లైన్ వ్యవహారాలు జరిపే వారిని దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వ్యక్తిగత వివరాలను సేకరించి మన పేరుతోనే మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు. మన ఆధార్ నెంబర్‌తో సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసుకుని ఈ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇటీవల విజయవాడలోని ఓ వ్యక్తి ఆధార్ కార్డుతో ఏకంగా 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దాన్ని గుర్తించిన టెలికాం అధికారులు వాటన్నింటినీ బ్లాక్ చేశారు. ఇలా ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే టెలికాం శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. ఒక ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులు తీసుకునేందుకు మాత్రమే అనుమతించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వస్తే.. రీ-వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో మరో ప్రత్యేక ఏర్పాటును చేసింది. ప్రతి ఒక్కరూ.. తమ ఆధార్ కార్డు పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ఒక వైబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. దీని ద్వారా ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నెంబర్లు అనుసంధానమై ఉన్నాయో చెప్పడమే కాకుండా.. మొబైల్‌ను ఎవరైనా చోరీ చేసినా.. పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసుకునేలా అవకాశం కల్పించారు.

మొదట https://www.sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో ‘బ్లాక్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్’, know your mobile connecton (https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/) అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. రెండో ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. వినియోగదారుడి 10 అంకెల మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నెంబర్ల జాబితా చూపిస్తుంది. ఇందులో ఏదైనా నెంబర్ మీది కాకపోయినా.. ప్రస్తుతం వినియోగించకపోయినా.. దాన్ని బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. వినియోగదారులు వెంటనే ఈ సదుపాయాన్ని వినియోగించి తమ ఆధార్‌పై ఉన్న సిమ్ కార్డుల వివరాలను తెలుసుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =