మాన‌వ గ‌గ‌న్‌యాన్ సాకారం దిశ‌గా భార‌త్‌

India Towards The Realization Of Human Gaganyaan,Gaganyaan,Gaganyaan Mission 2023,Gaganyaan Mission Accomplished,Mango News,Mango News Telugu,Gaganyaan Mission Test Flight Live Updates,Gaganyaan Mission Test Flight News,Gaganyaan Mission Latest News And Updates,Gaganyaan Mission News,Gaganyaan Mission Latest News,Gaganyaan Test Flight Successful,Gaganyaan Test Flight,Gaganyaan Test Flight 2023India Towards The Realization Of Human Gaganyaan,Gaganyaan,Gaganyaan Mission 2023,Gaganyaan Mission Accomplished,Mango News,Mango News Telugu,Gaganyaan Mission Test Flight Live Updates,Gaganyaan Mission Test Flight News,Gaganyaan Mission Latest News And Updates,Gaganyaan Mission News,Gaganyaan Mission Latest News,Gaganyaan Test Flight Successful,Gaganyaan Test Flight,Gaganyaan Test Flight 2023

అంత‌ర‌క్షింలోకి మాన‌వుల యాత్ర క‌ల సాకారం అయ్యేలా భార‌త్‌లోని ప్ర‌యోగాలు ముంద‌కు సాగుతున్నాయి. మ‌న శాస్త్ర‌వేత్త‌ల అనిత‌ర సాధ‌మ్యైన కృషితో ఆ దిశ‌గా అడుగులు వ‌డివ‌డిగా ప‌డుతున్నాయి. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఈరోజు టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌–1 వాహక నౌక ( టీవీ–డీ1) ప్రయోగం స‌క్సెస్ కావ‌డ‌మే ఇంద‌కు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. తొలుత సాంకేతిక లోపంతో తాత్కాలికంగా వాయిదా ప‌డినా.. అనంతరం విజయవంతంగా ప్రయోగించారు. రాకెట్‌ ఇంజిన్‌లో ఇగ్నిషన్‌ లోపాన్ని గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఇంజిన్‌ మండకపోవడం వల్ల అనుకున్న సమయానికి గగన్‌యాన్‌ మాడ్యూల్‌ పరీక్షను నిర్వహించలేకపోయారు.  తిరిగి ఈ పరీక్షను  మళ్లీ ఎప్పుడు నిర్వహించేది  త్వరలో వెల్లడించనున్నట్లు  ఇస్రో చైర్మెన్‌ సోమనాథ్‌ తెలిపారు. అంతలోనే  అనుకున్న ల‌క్ష్యం సాధించారు.

తొలుత వాతావరణం సరిగా లేని కారణంగా టీవీ–డీ1 ప్రయోగాన్ని 8.45 నిమిషాలకు వాయిదా వేశారు. అయితే ఆటోమెటిక్‌ లాంచ్‌ సీక్వెన్స్‌లో లోపం తలెత్తింది. దీంతో 5 సెకన్ల ముందు పరీక్షను రద్దు చేశారు. ఇంజిన్‌ ఇగ్నిషన్‌ నార్మల్‌గా జరగలేదని సోమనాథ్‌ వెల్లడించారు. పొరపాటు ఎక్కడ  జరిగిందో పరీక్షించనున్నట్లు ఆయన తెలిపారు.  వెహికల్‌  సేఫ్‌గానే  ఉందని సోమనాథ్‌ చెప్పారు. ఆటోమెటిక్‌ లాంచ్‌ సీక్వెన్స్‌ ఎందుకు ఆగిందో విశ్లేషించనున్నట్లు పేర్కొన్నారు.  విశ్లేషణ పూర్తి అయిన తర్వాత మళ్లీ ప్రయోగ సమయాన్ని ప్రకటించనున్నట్లు సోమనాథ్‌ చెప్పారు. ఆటోమెటిక్‌ సీక్వెన్స్‌లో లోపం ఉన్నట్లు కంప్యూటర్‌ గుర్తించిందని, దీంతో లాంచింగ్‌ను వాయిదా వేశామన్నారు. తొలుత టీవీ–డీ1 మాడ్యూల్‌ను ఉదయం 8 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. అయితే వాతావరణం సరిగా లేని కారణంగా ఆ ప్రయోగాన్ని 8.45 నిమిషాలకు వాయిదా వేశారు. లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకున్నప్పటికీ, తర్వాత 10 గంటలకు ప్రయోగాన్ని చేపట్టగా టీవీ–డీ1 విజయవంతంగా ఆకాశంలోకి ఎగిరింది. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను రాకెట్‌ వదిలి పెట్టింది. తర్వాత పారాచూట్ల సహాయంతో సురక్షితంగా దిగింది.

మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో చేపడుతున్న కార్యక్రమమే గగన్‌యాన్ . 2025లో ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో మూడు రోజులు ఉంచి, సురక్షితంగా భూమ్మీదకు తిరిగి తీసుకురావడమే ఈ ప్రయోగం అంతిమ లక్ష్యం. ఇది విజయవంతమైతే, భారత్ ఆపై నిర్వహించబోయే మావన అంతరిక్ష యాత్రలు, ఇతర ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుంది. అక్టోబర్ 17న ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సహా పలువురు శాస్త్రవేత్తలు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై, గగన్‌యాన్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు కూడా చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ 20 రకాల పరీక్షల్లో భాగంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్‌ ప్రయోగాన్ని అక్టోబర్ 21న నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.ఈ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 8 =