జనాలకు షాపింగ్ సరదా.. పోలీసులకు కొత్త పరేశాన్

An unabated craze for Lulu Mall,unabated craze for Lulu,craze for Lulu Mall,Mango News,Mango News Telugu,Lulu Mall, craze for Lulu Mall, Shopping, fun for the people, police, Traffic,LuLu Group International,Lulu mall is now open in Hyderabad,Lulu Mall Latest News,Lulu Mall Latest Updates,Lulu Mall Live News,Hyderabad News,Telangana News,Telangana Latest News And Updates
Lulu Mall, craze for Lulu Mall, Shopping, fun for the people, police, Traffic

అసలే ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో లులు మాల్  కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఆఫర్ల మీద ఆఫర్లు.. ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా కావడంతో లులు మాల్‌కు సిటీజనులు తెగ పోటెత్తుతున్నారు. డే వన్ నుంచి  ఇప్పటి వరకూ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఎప్పుడు తిరునాళ్లను  తలపించేలా లులు మాల్ కిటకిటలాడుతుంది. అయితే వెంకి పెళ్లి సుబ్బిగాడి చావుకు వచ్చిందన్న  చందంగా లులు మాల్ క్రేజ్ పోలీసులకు తలనొప్పిని తీసుకువస్తుంది.  మాల్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. మాల్‌కు వచ్చినవారి తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు.

అందులోనూ దసరా శెలవులు కావడంతో పాటు.. వీకెండ్స్‌లో మాల్‌కొచ్చే వారి సంఖ్య పెరిగిపోతుంది.  మామూలుగా  దసరా సీజన్‌లో  హైదరాబాద్‌లో చాలామందది  ఊరు బాట పట్టడంతో.. చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అందుకే పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సిటీలో రోడ్లన్నీ చాలా వరకు ఖాళీగా కనిపించేవి. కానీ ఈ సారి హైదరాబాద్‌లో ఈ సీన్ కనిపించడం లేదు. ఇప్పుడు అంతా లులు మాల్ బాట పట్టడంతో ఆ  పరిసరాలు సందడిగా మారిపోతున్నాయి.  దసరా, వీకెండ్ సెలవులు ఒకేసారి రావడంతో  లులు మాల్‌లో జనాల తాకిడి విపరీతంగా పెరిగింది.

అంతేకాదు హైదరాబాద్‌లో చుట్టాలుండేవారంతా ఇప్పుడు ప్రత్యేకంగా లులు మాల్‌ను చూడటానికి హైదరాబాద్ వస్తున్నారు. అందులోనూ దసరా సీజన్ కావటంతో ఊరించే ఆఫర్లతో పాటు.. మాల్‌లో ఉన్న మల్టీప్లెక్స్‌లకు  వెళ్లాలనుకునేవారి సంఖ్య కూడా ఎక్కువైంది.  దీంతో హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలు కూడి వివిధ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటు సాయంత్రం అయితే చాలు హైదరాబాదీలు కుకట్ పల్లి వైపు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అటు వెళ్లాల్సి వస్తే గంటల కొద్దీ ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోతున్నారు.

మరోవైపు లులు మాల్ ప్రారంభమైనప్పటి నుంచీ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కొత్త తలనొప్పి మొదలయింది. ఎందుకంటే పెరుగుతున్న వాహనాలు సంఖ్యతో.. ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా సాయంత్రపు సమయాల్లో ‘లులు మాల్’ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అందులోనూ దసరా పండుగకు  ‘లులు మాల్‌’లో షాపింగ్ చేయాలనుకునే వారితో మాల్  కిక్కిరిపోతుంది.  ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా నగరవాసులు ‘లులు మాల్’కు క్యూ కట్టడంతో.. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.

మరోవైపు కొనుగోలుదారులను  అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి ఆఫర్లు పెట్టొద్దని లుల్ మాల్‌లోని నిర్వాహకులకు పోలీసులు సూచిస్తున్నారు. మామూలుగానే మాల్‌కు జనాలు పోటెత్తుతున్నారు కాబట్టి ఆఫర్లు పెట్టి ఇంకా ఆకట్టుకోవద్దని..దీని వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువ  అవతుందని చెబుతున్నారు.  అలాగే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి  మాల్ సిబ్బందిని  ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం చర్యలు తప్పవని ‘లులు మాల్’ నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =