నేడే ఆఖరి టీ20 మ్యాచ్, భారత్, ఇంగ్లాండ్ జట్లలో సిరీస్ విజేత ఎవరో?

IND vs ENG 5th T20, Ind vs Eng 5th T20 Dream11 Prediction, IND vs ENG 5th T20 watch LIVE Streaming, Ind vs Eng 5th T20I Match, Ind vs Eng 5th T20I Match Updates, India vs England, India vs England 2021, India vs England 5th T20 Live Streaming, India vs England Match News, India vs England Match updates, India vs England T20 Series, Mango News

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ చెరో రెండు మ్యాచులు గెలవడంతో ప్రస్తుతానికి సిరీస్‌ 2-2తో సమమైంది. నాలుగో టీ20 లో విజయం సాధించిన భారత్ జట్టు నేడు జరిగే కీలక మ్యాచులో కూడా మెరుగైన ప్రదర్శన చేసి సిరీస్‌ గెలిచేందుకు సిద్ధమైంది. కాగా మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ జట్టు భారత్ కు ఈ సిరీస్ లో గట్టి పోటీ ఇస్తుంది.

మరోవైపు టాస్ గెలవడంపై కూడా చర్చ నడుస్తుంది. మొదటి 3 టీ20 మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టే విజయం సాధించగా, నాలుగో మ్యాచ్‌లో భారత్ టాస్‌ ఓడి మొదటగా బ్యాటింగ్‌ చేసి విజయం సాధించింది. ఏదేమైనా ఇరుజట్ల మధ్య సిరీస్‌ లో విజేతను నిర్ణయించే ఈ కీలక మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

భారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/ ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్.

ఇంగ్లాండ్ తుదిజట్టు అంచనా: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), సామ్ కుర్రాన్/మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twelve =