రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకున్న రూపాయి విలువ, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ. 80 మార్కుకు చేరువలో

Indian Rupee Settles at All Time Record Low of 79.98 Briefly Touches Rs 80 Mark Against US Dollar, Indian Rupee Briefly Touches Rs 80 Mark Against US Dollar, Indian Rupee Settles at All Time Record Low of 79.98, Indian Rupee settles at record low of 79.98 against US dollar, Indian rupee briefly touched an all-time low of 80 per dollar mark, Indian Rupee Settles at All Time Record Low, All Time Record Low of 79.98, US dollar, Indian Rupee, Indian Rupee at 80 to the dollar, Indian Rupee News, Indian Rupee Latest News, Indian Rupee Latest Updates, Indian Rupee Live Updates, Mango News, Mango News Telugu,

భారతీయ కరెన్సీ ‘రూపాయి’ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా పతనమైంది. ఈ క్రమంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ కనిష్ట స్థాయి 79.98 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ. 80 మార్కుకు చేరువలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ముడి చమురు ధరల పెరుగుదల, కరెంటు ఖాతా లోటుతో పాటు ద్రవ్యోల్బణమూ పెరుగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడంతో మార్కెట్ లో రూపాయి ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఆసియాలో సోమవారం మధ్యాహ్నం ట్రేడింగ్‌లో డాలర్ ఇండెక్స్ బలహీనంగా ఉందని, అయితే ఫెడరల్ రిజర్వ్ అధికారులు రేటు పెంపుపై సుముఖంగా లేరని ట్రేడ్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు.

పెరుగుతున్న క్రూడ్ ధరలు మరియు నిరంతర విదేశీ నిధుల ప్రవాహాలు వంటివి దీనిపై అసాధారణ ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ పెరగడం మరియు యుఎస్ డాలర్ బలహీనత వంటి సానుకూల పక్షపాతంతో రూపాయి వర్తకం చేసే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి 7శాతం మేర క్షీణించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నరేంద్ర మోదీ సర్కార్ 2014లో తొలిసారి ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ దాదాపు 25శాతం మేర క్షీణించడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సోమవారం పార్లమెంటులో వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =