ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ కీలక ప్ర‌క‌ట‌న.. రెపో రేటు మరో 50 బేసిస్ పాయింట్లు పెంపు

RBI Governor Shaktikanta Das Announces Repo Rate Hike by 50 Basis Points To 5.90%, RBI Governor Shaktikanta Das, Repo Rate Hike, Repo Rate 50 Basis Points Hike, Mango News, Mango News Telugu, Repo Rate, RBI Governer New Repo Rate, RBI Governor, Shaktikanta Das Announces Repo Rate Hike, Repo Rate Hike by 50 Basis Points, Hike by 50 Basis Points To 5.90%, Rbi Hikes Repo Rate By 50 Bsp To 5.9%, Repurchase Agreement, RBI Latest News And Updates

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బేసిస్ పాయింట్ల పాలసీ రేటు పెంపును 0.50 శాతం ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ శుక్రవారం ప్ర‌క‌ట‌న చేశారు. రెపో రేటును 5.40 శాతం నుండి 5.90 శాతానికి పెంచినట్లు ఆయన తెలిపారు. తొలి క్వార్ట‌ర్‌లో జీడీపీ అంచ‌నాల‌కు మించి త‌గ్గిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణం 7 శాతం ఉంద‌ని, రెండ‌వ క్వార్ట‌ర్‌లో 6 శాతానికి చేరుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు శ‌క్తికాంత్ దాస్ వెల్ల‌డించారు. దీంతో రెపో రేటును పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం.

ఆర్బీఐ నిర్ణయం ప్రకారం.. ఐదు నెలల్లో 1.90 శాతం రెపో రేటు పెరుగగా, తదుపరి మూడు నెలలపాటు ఇది అమల్లో ఉండనుంది. కాగా క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌కు రెపో రేటు ప్ర‌కారమే ఆర్బీఐ రుణాలు అంద‌జేస్తుంది. తాజా నిర్ణయంతో రెపో రేటు పెర‌గ‌డం వ‌ల్ల కార్పొరేట్లు మరియు వ్య‌క్తిగ‌త క‌స్ట‌మ‌ర్ల‌కు ఇక నుంచి రుణాలు మ‌రింత భారం అవనున్నాయి. దీనికి సంబంధించి ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సెప్టెంబర్ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రేపో రేటు పెంచడంతో ఇకపై గృహ రుణాలు, కార్లు రుణాలు, విద్యా రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 8 =