భారత్, శ్రీలంక మధ్య నేడే రెండో టీ20, గాయంతో సంజూ శాంసన్‌ దూరం, జట్టులోకి జితేష్ శర్మ

India vs Sri Lanka 2nd T20I at Pune Today Wicket-keeper Batter Sanju Samson Ruled out Jitesh Sharma Into Team,India vs Sri Lanka 2nd T20I,Wicket-keeper Batter Sanju Samson Ruled out,Jitesh Sharma Into Team,Mango News,Mango News Telugu,Sri Lanka Vs India T20,Sri Lanka Vs India Live,India Vs Sri Lanka Today,Sri Lanka Vs India Live Score,Sri Lanka Vs India Squad,India Vs Sri Lanka Tickets,India Vs Sri Lanka 2023 T20,India Vs Sri Lanka Highlights,Sri Lanka Vs India,Sri Lanka Vs India Live Streaming,Sri Lanka Vs India 2021,Sri Lanka Vs India Test,Sri Lanka Vs India 2022,Sri Lanka Vs India Odi,Sri Lanka Vs India Live Match,Asia Cup Srilanka Vs India,Srilanka W Vs India W,Shivam Mavi Latest News and Updates,Shivam Mavi Total Wickets

భారత్, శ్రీలంక జట్ల​ మధ్య ప్రస్తుతం మూడు టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత్ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక పూణేలో నేడు రెండవ టీ20, ఆ తర్వాత రాజ్ కోట్ లో జనవరి 7న చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో మిగిలిన రెండు టీ20లు ఆడబోయే భారత్ జట్టులో చోటుచేసుకున్న ఓ మార్పుపై భారత్ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ గాయపడడంతో, ఆ స్థానంలో జితేష్ శర్మ టీ20 జట్టులోకి వచ్చాడని తెలిపారు.

“శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ లో మిగిలిన మ్యాచ్ లకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు దూరమయ్యాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తోలి టీ20లో బౌండరీ రోప్‌ల దగ్గర బంతిని ఫీల్డింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు శాంసన్ ఎడమ మోకాలికి గాయమైంది. బీసీసీఐ మెడికల్ టీమ్ ముంబయిలో ఈ మధ్యాహ్నం స్కాన్లు మరియు స్పెషలిస్ట్ అభిప్రాయాన్ని తీసుకుంది, అనంతరం అతనికి విశ్రాంతి మరియు పునరావాసానికి సలహా ఇచ్చింది. దీంతో సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది” అని బీసీసీఐ తెలిపింది

శ్రీలంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + sixteen =