భారత్ vs ఆస్ట్రేలియా: నాలుగో టెస్టులో చిరస్మరణ విజయంతో సిరీస్ భారత్ కైవసం

2-1 against Australia, AUS vs IND, Brisbane Test, Highlights India vs Australia Match, IND vs AUS 4th Test highlights, IND vs AUS 4th Test Results, India breaches Australia’s Brisbane fortress, India clinch Australia Test series, India vs Australia, India vs Australia Match, India Wins Test Series, India Wins Test Series with 2-1 against Australia, Mango News

బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా బిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు‌ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ జట్టు చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ జట్టు‌ 2-1తో కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో 4/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు‌ 7 వికెట్లు కోల్పోయి 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఆటగాళ్లలో ముందుగా ఓపెనర్ శుభమన్‌ గిల్ (91) కీలక ఇన్నింగ్స్ ఆడగా , ‌రిషబ్ పంత్‌(89) పరుగులతో మర్చిపోలేని‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయం వైపు నడిపించాడు.

ఇక ఈ విజయంలో చటేశ్వర్ పుజారా(56) పరుగులతో, చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (25) పరుగులతో అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. 32 సంవత్సరాలుగా గబ్బా స్టేడియంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా జట్టుకు భారత జట్టు చిరస్మరణ విజయంతో సత్తా చూపించింది. రెండో ఇన్నింగ్స్ లో రాణించిన రిషబ్ పంత్ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గా నిలిచాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ను ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ దక్కించుకున్నాడు.

భారత్–ఆస్ట్రేలియా నాలుగో టెస్టు వివరాలు:

ఆస్ట్రేలియా తోలి ఇన్నింగ్స్: 369-10

  • లబుషేన్‌ (108), పైన్ (50)
  • నటరాజన్ 3/78, శార్దూల్ ఠాకూర్ 3/94, వాషింగ్టన్ సుందర్ 3/89

భారత్ తోలి ఇన్నింగ్స్: 336-10

  • శార్దూల్ ఠాకూర్ (67), వాషింగ్టన్ సుందర్(62), శుభ్‌మన్‌ గిల్‌(44)
  • హేజెల్ వుడ్ 5/57, మిచెల్ స్టార్క్ 2/88, కమ్మిన్స్ 2/94

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్: 294-10

  • స్టీవ్ స్మిత్ (55), వార్నర్ (48)
  • సిరాజ్ 5/73, శార్దూల్ ఠాకూర్ 4/61

భారత్ రెండవ ఇన్నింగ్స్: 329-7

  • శుభ్‌మన్‌ గిల్‌(91), రిషబ్ పంత్(89)
  • కమ్మిన్స్ 4/55, లియాన్ 2/85
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =