బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళన, స్పందించిన మంత్రి కేటీఆర్

MInister KTR Responds over Basara RGUKT Students Issue, Telangana MInister KTR Responds over Basara RGUKT Students Issue, KTR Responds over Basara RGUKT Students Issue, Telangana RGUKT Students Protests Demanding Good Quality Food And Water In Campus, students of Rajiv Gandhi University of Knowledge and Technologies continued their protest against the college administration, RGUKT students continued their protest against the college administration, protest against the college administration, RGUKT students continued their protest, RGUKT Students Protests Demanding Good Quality Food And Water In Campus, Telangana RGUKT Students Demanding Good Quality Food And Water In Campus, Good Quality Food And Water In Campus, students intensified their protest with the support of students from RGUKT, IIIT Basara, Basara RGUKT Students Issue, RGUKT Students Issue, Telangana MInister KTR, protest was carried out at the main gate of the IIIT Basara, Telangana RGUKT Students Protest News, Telangana RGUKT Students Protest Latest News, Telangana RGUKT Students Protest Latest Updates, Telangana RGUKT Students Protest Live Updates, Mango News, Mango News Telugu,

నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యాల‌యంకు చెందిన విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచి చేపడుతున్న ఆందోళన బుధవారం కూడా కొనసాగిస్తున్నారు. ఆర్జీయూకేటీలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతులు, భోజన సదుపాయాలు సహా పలు అంశాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుండడంతోనే ఆందోళన చేపడుతున్నట్టు విద్యార్థులు పేర్కొన్నారు. కాగా బుధవారం ఓ విద్యార్థి ఈ సమస్యను ట్విట్టర్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. “దయచేసి ఆర్జీయూకేటీ బాసర సమస్యను పరిశీలించండి. 8000 మంది విద్యార్థులు రోడ్డుపై కూర్చున్నారు, మీ సమాధానం కోసం వేచి ఉన్నారు” అని అడిగాడు.

అనంతరం మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ప్రస్తావించిన అన్ని సమస్యలను సీఎం కేసీఆర్ మరియు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తాను. విద్య నాణ్యతను మెరుగుపరచడానికి సంబంధించి ఏవైనా సవాళ్లను పరిష్కరించడానికి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, “ఈ విషయమై ఈ రోజు సంబంధిత వీసీని సమావేశానికి పిలిచాము. ఆర్జీయూకేటీ బాసరలో సంబంధిత సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తాము” అని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + sixteen =