రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీరాజ్

Indian Women's Team Captain Mithali Raj Announces Retirement From All Formats of International Cricket, Mithali Raj Announces Retirement From All Formats of International Cricket, Indian Women's Team Captain Mithali Raj Announces Retirement, India women's cricket team's ODI and Test captain Mithali Raj, India women's cricket team's ODI and Test captain Mithali Raj announced her retirement from all forms of the game, Cricket legend Mithali Raj announces retirement, Indian women's cricket icon, Indian women's ODI and Test team captain Mithali Raj announced retirement from all formats of the game, Test team captain Mithali Raj announced retirement from all formats of the game, Indian women's ODI captain Mithali Raj announced retirement from all formats of the game, Mithali Raj Announces Retirement, Test captain Mithali Raj, ODI captain Mithali Raj, Indian Women's Team Captain, Mango News, Mango News Telugu,

భారత మహిళల క్రికెట్‌ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ అభిమానులకు షాక్ ఇచ్చారు. తన సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. అన్ని రకాల అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కెప్టెన్ మిథాలీ రాజ్ సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ తన 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్‌ తరఫున 12 టెస్టులు, 232 వన్డేలు మరియు 89 టీ20లు ఆడింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రికార్డు సాధించింది. ఆమె 232 మ్యాచ్‌లలో 50.68 సగటుతో 7805 పరుగులు చేసింది.

‘సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు! మీ ఆశీర్వాదం మరియు మద్దతుతో నా రెండో ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాను. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అత్యున్నత గౌరవం. ఇండియా జెర్సీ ధరించి చేసిన ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి సంఘటన నాకు ఏదో ఒక ప్రత్యేకతను నేర్పింది. గత 23 సంవత్సరాలు నా జీవితంలో అత్యంత సంతృప్తికరంగా, సవాలుగా మరియు ఆనందించే సంవత్సరాలుగా గడిచిపోయాయి’ అని మిథాలీ ట్వీట్ చేసింది. కాగా మంగళవారం విడుదల చేసిన ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మిథాలీ ఏడో స్థానంలో కొనసాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =