పాలస్తీనా దేశంలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

India's Envoy To Palestine Mukul Arya Passes Away Found Body on Office Premises, India's Envoy To Palestine, Mukul Arya Passes Away, Mukul Arya Body Found on Office Premises, India, Palestine, Mukul Arya Passed Away, Mukul Arya, India’s representative at Ramallah, Indian Representative in Palestine, Mukul Arya India's representative at the Palestinian city, Palestinian city, Mukul Arya India's representative at the Palestinian city of Ramallah has passed away, Ramallah, Manog News, Manog News Telugu,

పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్‌ ఆర్య ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ముకుల్ ఆర్య రామల్లాహ్‌లోని భారత ఎంబసీలో విగతజీవిగా పడిఉండటాన్ని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. 36 ఏళ్ల ఆర్య ఆకస్మిక మరణం పట్ల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్య మరణానికి కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, అతను చాలా తెలివైన మరియు ప్రతిభావంతుడైన అధికారి. నా హృదయం అతని కుటుంబం మరియు ప్రియమైనవారి కోసం ప్రార్ధిస్తోంది అని జైశంకర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్య మృతదేహాన్ని తరలించడానికి భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్య మరణవార్తతో అతనితో పాటు పనిచేసిన చాలా మంది భారతీయ అధికారులు షాక్ కి గురయ్యారు. ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైనది. ఒక అద్భుతమైన సహోద్యోగి ఇంత చిన్న వయస్సులోనే దూరమయ్యాడు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి TS తిరుమూర్తి అన్నారు. ఈయన గతంలో పాలస్తీనాకు ప్రతినిధిగా కూడా పనిచేశారు. మరోవైపు ఆర్య మృతిపై పాలస్తీనా దేశం కూడా స్పందించింది. ఈ కేసును నిశితంగా పరిశీలించేందుకు తక్షణమే ఆయన నివాస స్థలానికి వెళ్లాల్సిందిగా పోలీసు అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులను అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహ్మద్ ష్టాయే ఆదేశించినట్లు పాలస్తీనా విదేశాంగ శాఖ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 20 =