ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు: సభలో గవర్నర్‌ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు, వాకౌట్‌

Andhra Pradesh Budget Session 2022-23 TDP Members Walkout From The Assembly, TDP Members Walkout From The Assembly, AP Budget Session 2022-23 TDP Members Walkout From The Assembly, AP Budget Session 2022, Budget Session, Andhra Pradesh Budget Session, AP Budget Session, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, Andhra Pradesh assembly budget session, AP Budget 2022-23, AP Budget 2022, AP Budget, Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Session, Budget Session 2022, Manog News, Manog News Telugu,

ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత జాతీయ గీతంతో సమావేశాలను ప్రారంభించిన అనంతరం గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే, గవర్నర్‌ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. కానీ, గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని సభలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు గవర్నర్‌ ప్రసంగ ప్రతులను కూడా చింపివేశారు. దీనిపై ఏపీ సీఎం జగన్‌ వారి వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో.. వారు సమావేశం నుంచి బయటకు వెళ్లి అసెంబ్లీ లాబీలో బైటాయించి తమ నిరసన కొనసాగించారు. గవర్నర్‌ వచ్చే దారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుపడకుండా అసెంబ్లీ మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీనిపై మార్షల్స్‌ కి, టీడీపీ సభ్యులకి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. కాగా, సమావేశాలను ఈనెల 26 వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =