సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి.నటరాజన్ కు కరోనా, ఐసోలేషన్ లోకి మరో ఆరుగురు

DC vs SRH, Hyderabad Player T Natarajan Tested Positive for Covid-19, IPL 2021, IPL 2021 All Updates, IPL-2021 in UAE, Mango News, SunRisers Hyderabad Bowler T Natarajan, Sunrisers Hyderabad Player T Natarajan Tested Positive, Sunrisers Hyderabad Player T Natarajan Tested Positive for Covid-19, sunrisers hyderabad players, T Natarajan Tested Positive for Covid-19, T Natarajan tests positive for Covid-19

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 రెండో దశ సెప్టెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రెండో దశ ప్రారంభంలోనే కోవిడ్-19 మహమ్మారి కలకలం మొదలైంది. తాజాగా షెడ్యూల్ లో భాగంగా నిర్వహించిన కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి.నటరాజన్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. టి.నటరాజన్ మిగిలిన జట్టు నుండి తనను తాను వేరు చేసుకున్నాడని, అతనికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

టి.నటరాజన్ తో ఆరుగురు సన్నిహితంగా ఉన్నట్టుగా వైద్య బృందం గుర్తించిందని తెలిపారు. వారందరూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచబడ్డారని చెప్పారు. ఐసోలేషన్ లో ఉన్నవారిలో ఆటగాడు విజయ్ శంకర్, టీమ్ మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్ జె, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి గణేషన్ ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు క్లోజ్ కాంటాక్ట్స్ సహా మిగిలిన బృందానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగాయని, పరీక్ష నివేదికలు నెగటివ్ గా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్‌ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు రాత్రి జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here