జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలం

EOS-03 mission couldn’t be accomplished, GSLV-F10 mission ‘couldn’t be accomplished, GSLV-F10 mission could not be accomplished, ISRO GSLV-F10, ISRO Latest News, ISRO Latest Udpates, ISRO News Today, ISRO Says GSLV-F10 Mission Couldn’t be Accomplished as Intended due to Technical Anomaly, ISRO’s GSLV-F10, ISRO’s GSLV-F10/EOS-03 mission could not be completed, Mango News, Mission unsuccessful, Satellite mission couldn’t be accomplished’ due to tech error

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆగస్టు 12, గురువారం ఉదయం 5.43 గంటలకు జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 రాకెట్ ను నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఎర్త్ ఆబ్సెర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-03) ను మోసుకెళ్తూ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్ళింది. అయితే ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విఫలమైంది. “షెడ్యూల్ ప్రకారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం ఈరోజు 05.43 గంటల వద్ద జరిగింది. మొదటి మరియు రెండవ దశల పనితీరు సాధారణంగానే జరిగింది. అయితే సాంకేతిక క్రమరాహిత్యం కారణంగా క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇగ్నిషన్ జరగలేదు. దీంతో ఉద్దేశించిన విధంగా ఈ మిషన్ పూర్తి కాలేదు” అని ఇస్రో ప్రకటన చేసింది.

ముందుగా ఆగస్టు 11, బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ రాకెట్ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం రాకెట్ నింగిలోకి వెళ్లింది. ఈఓఎస్-03 శాటిలైట్ ద్వారా తుఫానులు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలను త్వరగా పర్యవేక్షించడానికి వీలుంటుంది. అయితే మూడోది అయిన క్రయోజెనిక్‌ దశలో సమస్య తలెత్తడం కారణంగానే ఈ ప్రయోగం విఫలమైందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 2 =