కార్గిల్ విజయ్ దివాస్ 2022: అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

Kargil Vijay Diwas 2022 President Droupadi Murmu and PM Modi Pays Tribute To War Heroes, President Droupadi Murmu and PM Modi Pays Tribute To War Heroes, PM Modi Pays Tribute To War Heroes, President Droupadi Murmu Pays Tribute To War Heroes, Tribute To War Heroes, Kargil Vijay Diwas 2022, 2022 Kargil Vijay Diwas, Kargil Vijay Diwas, President Droupadi Murmu, tributes to soldiers who lost their lives in 1999 Kargil War on Kargil Vijay Diwas, 1999 Kargil War, Kargil Vijay Diwas 2022 tributes to soldiers who lost their lives in 1999 Kargil War, Defence Minister Rajnath Singh and several other Ministers paid tribute to the brave hearts of Kargil War, Kargil Vijay Diwas 2022 News, Kargil Vijay Diwas 2022 Latest News, Kargil Vijay Diwas 2022 Latest Updates, Kargil Vijay Diwas 2022 Live Updates, Mango News, Mango News Telugu,

నేడు ‘కార్గిల్ విజయ్ దివాస్’ సందర్భంగా 1999లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి అమరులైన వీర సైనికులకు భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నివాళులర్పించారు. కాగా నిన్న రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు స్వీకరించిన ముర్ము నేడు కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ‘కార్గిల్ విజయ్ దివాస్’పై తన తొలి అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ట్విట్టర్‌లో “కార్గిల్ విజయ్ దివస్ మన సాయుధ దళాల అసాధారణ పరాక్రమం, శక్తి మరియు సంకల్పానికి చిహ్నం. భారతమాతను రక్షించేందుకు ప్రాణాలర్పించిన వీర సైనికులందరికీ నమస్కరిస్తున్నాను. దేశప్రజలందరూ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటారు. జై హింద్!” అని పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని మోదీ కూడా ‘కార్గిల్ విజయ్ దివాస్’ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ విజయ్ దివాస్ ‘గర్వానికి, కీర్తికి ప్రతీక’ అని పేర్కొంటూ దేశంలోని సైనిక వీరులందరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలిపారు. “కార్గిల్ విజయ్ దివస్ మా భారతి యొక్క గర్వం మరియు కీర్తికి చిహ్నం. ఈ సందర్భంగా, మాతృభూమి రక్షణలో తమ పరాక్రమాన్ని సాధించిన దేశ వీర పుత్రులందరికీ నా వందనం. జై హింద్!” అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు.

ఇక ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జమ్మూలోని బలిదాన్ స్తంభ్‌లో భారత సైన్యం పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించింది. 1998లో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మే 8, 1999 మరియు జూలై 26, 1999 మధ్య జరిగిన యుద్ధానికి గుర్తుగా ‘కార్గిల్ విజయ్ దివాస్‌’ను ప్రతి సంవత్సరం జూలై 26 న జరుపుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + four =