“స్వతంత్ర భారత వజ్రోత్సవాలు”: 24 మందితో కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Constitutes Committee with 24 Members to Organize Swathantra Bharata Vajrotsavalu, Constitutes Committee with 24 Members to Organize Swathantra Bharata Vajrotsavalu, Telangana Govt Constitutes Committee with 24 Members, Swathantra Bharata Vajrotsavalu, Swatantra Bharat Vajrotsava Fortnight programs should be organized in the state before August 15, Telangana Swathantra Bharata Vajrotsavalu, Committee with 24 Members to Organize Swathantra Bharata Vajrotsavalu, Telangana Govt, 24 Members Committee, August 15, Swathantra Bharata Vajrotsavalu News, Swathantra Bharata Vajrotsavalu Latest News, Swathantra Bharata Vajrotsavalu Latest Updates, Swathantra Bharata Vajrotsavalu Live Updates, Mango News, Mango News Telugu,

ఆగస్టు 8, 2022 నుండి ఆగస్టు 22, 2022 వరకు “స్వతంత్ర భారత వజ్రోత్సవాలు” నిర్వహించడం ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఘనంగా మరియు సముచితంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ వేడుకలను మన స్వాతంత్య్రానికి స్ఫూర్తినిచ్చిన అత్యున్నత ఆదర్శాలు మరియు దేశభక్తి స్ఫూర్తిని హైలైట్ చేసేలా నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చేసిన త్యాగాల గురించి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు ఈ వేడుకలు ఉద్దేశించబడ్డాయి. ఈ నేపథ్యంలో “స్వతంత్ర భారత వజ్రోత్సవాలు” ప్లాన్ చేయడానికి మరియు నిర్వహించడానికి 24 మందితో కూడిన ఒక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ సినియర్ నేత, రాజ్యసభ ఎంపీ డా.కె.కేశవ రావు చైర్మన్ గా, మిగిలిన వారు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ ఆగస్టు 8 నుండి 22 వరకు వివిధ సాంస్కృతిక, సాహిత్య మరియు ఇతర కార్యక్రమాలను ప్లాన్ చేసి నిర్వహించాలని మరియు ఎప్పటికప్పుడు పురోగతిని ప్రభుత్వానికి నివేదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహణ కమిటీ:

  1. డా.కె.కేశవ రావు (చైర్మన్)
  2. మంత్రి కే తారకరామారావు
  3. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  4. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
  5. మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  6. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  7. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
  8. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి
  9. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  10. డీజీపీ మహేందర్‌రెడ్డి
  11. ఎంపీ రంజిత్‌రెడ్డి
  12. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌
  13. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
  14. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి
  15. సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌
  16. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్)
  17. ప్రభుత్వ సెక్రెటరీ (యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం మరియు కల్చర్)
  18. ప్రభుత్వ సెక్రెటరీ (పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్)
  19. ప్రభుత్వ సెక్రెటరీ (విద్యా శాఖ)
  20. జీహెచ్‌ఎంసీ కమిషనర్
  21. డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్
  22. డైరెక్టర్ ఆఫ్ ఐ అండ్ పీఆర్
  23. ప్రభుత్వ సెక్రెటరీ జీఏడీ (పొలిటికల్) – కన్వీనర్
  24. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ – ప్రత్యేక ఆహ్వానితుడు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 2 =