ఏ సమయంలో సూర్యరశ్మి తగిలేలా నిలబడితే విటమిన్ డి దొరుకుతుందో తెలుసా?

Low Vitamin D Do this,Low Vitamin D,Do this For Vitamin D,Mango News,Mango News Telugu,Vitamin D Benefits,Low Vitamin D , vitamin D get when you stand in the sun,Vitamin D Deficiency,Vitamin D deficiency symptoms,Symptoms of Low Vitamin D,Vitamin D Deficiency Affects the Body, Low Vitamin D Latest News,Low Vitamin D Latest Updates,Low Vitamin D Live News
Vitamin D Benefits,Low Vitamin D? , vitamin D get when you stand in the sun?

కాలం మారినట్లే కాలంతో పాటు మనిషి అలవాట్లు, జీవనశైలి మారుతున్నాయి. దానికి తగ్గట్లే ఒకప్పుడు వినలేని వింతవింత జబ్బులు, విటమిన్ల లోపాలు మనుషులలో కనిపిస్తున్నాయి.దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విటమిన్ డి. పైసా ఖర్చు లేకుండా దొరికే ఈ విటమిన్‌ను కూడా ఇప్పుడు క్యాప్యూల్స్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. నిజమే ఇప్పుడు విటమిన్ డి లోపం అందరిలో పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా ఆఫీసులో ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.నిజానికి మనకు కావాల్సిన విటమిన్ డి అంతా సూర్యరశ్మిలోనే దొరుకుతుంది.

కానీ చాలామంది సూర్యరశ్మి లో ఉండటానికి ఇష్టపడరు. ఎండవల్ల చర్మం నల్లగా మారుతుందని.. ఒకవవేళ పిగ్మంటేషన్ సమస్య ఉంటే అది ఎండలో నిలబడితే ఇంకా ఎక్కువ అవుతుందని చాలా మంది ఎండకు దూరంగా ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువన్న విషయం చాలామందికి తెలియదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి ని మన శరీరానికి దూరం చేస్తున్నాం. అందుకే సూర్యరశ్మి శరీరానికి ఏ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు

శరీరంలో విటమిన్ డి లోపాన్ని నివారించాలనుకునేవాళ్లు సూర్యరశ్మిని తీసుకోవడం చాలా అవసరమని చెబుతున్న డాక్టర్లు… దీని కోసం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య 10 నుండి 15 నిమిషాల పాటు కానీ.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ ఎండలో నిలబడాలని అంటున్నారు. ఈ సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి కావాల్సిన మొత్తం విటమిన్ డిని పొందొచ్చని అంటున్నారు. అయితే ఈ సమయంలో మీ ముఖాన్ని చిన్న క్లాత్‌తో కప్పి ఉంచాలి ఎందుకంటే ఫేస్ ఎండకు ట్యాన్ అవకుండా ఉండటంతో పాటు పిగ్మంటేషన్ ఉంటే ఎక్కువ అవకుండా ఉంటుంది. అలాగే ఫేస్‌కు సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. సూర్యరశ్మి శరీరంలోని ఇతర భాగాలపై పడేలా ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ శరీరం కూడా ఫిట్‌గా మారుతుంది.

మీకు ఉదయం సమయంలో ఎండలో నిలబడటానికి వీలు కాకపోతే .. సాయంత్రం ఎండలో కూర్చోవచ్చు. సూర్యరశ్మి ఉదయం, సాయంత్రం రెండింటిలో కూడా ఒకే ప్రయోజనాలను ఇస్తుంది. శాతాకాలంలో పావుగంట కంటే కూడా ఎక్కువ సేపు ఉండటం మంచిది. అలాగే ఎండలో నిలబడేముందు రెండు గ్లాసుల నీళ్లు తాగితే ఎక్కువ ఫలితం ఉంటుంది. నీళ్లు తాగి నిలబడటం వల్ల శరీరం డీ హైడ్రేట్ అవకుండా ఉంటుంది.

విటమిన్ డి కోసం సూర్యకాంతితో పాటు ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ డి కోసం పాలు, పెరుగు రెగ్యులర్‌గా తినాలి. అంతే కాకుండా వింటర్ సీజన్ లో అయితే మీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నాన్ వెజ్ తినేవారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ ఫిష్ ఎక్కువ తినాలి. ఎందుకంటే ఇది విటమిన్ జికి మంచి మూలం.మామూలు చేపల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాకపోతే కాస్త తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గుడ్లు కూడా రోజూ తినాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 5 =