పెరుగుతున్న డిమాండ్‌.. ఆకాశాన్నంటుతున్న ఉల్లిగడ్డ ధరలు

Increasing demand skyrocketing onion prices,Increasing demand,skyrocketing onion prices,Increasing onion demand,Mango News,Mango News Telugu,Onion prices skyrocket in Hyderabad, Onion prices,Onion , Increasing demand, skyrocketing onion prices,Price of the onions has increased,Buying onions could leave you teary eyed,Wholesale onion price rises,skyrocketing onion price Latest News,skyrocketing onion price Latest Updates,skyrocketing onion price Live News
Onion prices skyrocket in Hyderabad, Onion prices,Onion , Increasing demand, skyrocketing onion prices

మొన్నటి వరకూ ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. టమోట ధరలతో పోటీ పడకుండా కాస్త శాంతించాయని అనుకునేలోగా.. మళ్లీ ఘాటెక్కుతున్నాయి. టమోట ధరలు కాస్త మెత్తబడ్డాయంటే ఉల్లి ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఒక్కసారిగా  25 నుంచి 50 శాతం పెరిగిపోయాయి. ప్రస్తుతం నాణ్యతను బట్టి కేజీకి  50 రూపాయల నుంచి 70  రూపాయల వరకు ఉల్లి ధర పలుకుతోంది.

అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి గడ్డ ధరలు మళ్లీ పెరుగుతుండటంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఒక ధర తగ్గితే.. వెంటనే మరో ధర పెరిగిపోయి షాక్ ఇస్తున్నాయని ..పెరిగిన ధరలు తమను నిత్యం పరేశాన్ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌లో రైతు బజార్‌లో ఉల్లిపాయాలను కొనాలన్నా కూడా భయపడే  స్థాయికి రేట్లు పెరిగిపోయాయి. రైతు బజార్‌లో ఉల్లి కిలో రూ.46కు చేరింది. అలాగే హైదరాబాద్‌లో కేజీ ఉల్లి రూ. 40 నుంచి 45 ఉండగా, డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల కొత్త పంట రావడానికి కాస్త ఆలస్యమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

సప్లయ్, డిమాండ్ సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లో ఉల్లి గడ్డ ధరలు ఈ  కొద్ది వారాల్లోనే రెట్టింపు అయ్యాయి. ఆలస్యమైన రుతుపవనాలతో పంటలపై ప్రభావం పడటంతో సరఫరా తక్కువగా ఉండడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని వారాల క్రితం వరకు రూ.10 కి విక్రయించిన ఉల్లి.. గత వారం రూ. 20 నుంచి 25 ఉండగా, ప్రస్తుతం రూ. 40 నుంచి 45 లకు చేరుకుంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో టమోటా ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఉల్లి ధరలతో పాటు వివిధ కూరగాయల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

వారం రోజుల్లోనే ..రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారులకు కోయకుండానే  కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కూరగాయలు సరసమైన ధరకు లభించే రైతు బజార్లలోనూ  ఉల్లిగడ్డ  కిలో రూ.46కు చేరింది. రిటైల్ మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.70 వరకు దొరుకుతుంది. అయితే రేట్లు పెరుగుతున్నా కూడా కూరగాయల నాణ్యత  మాత్రం తక్కువగానే  కనిపిస్తున్నాయని వినియోగదారులు  ఆరోపిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉల్లి పంటపై ప్రభావంతో డిమాండ్‌కు సరిపడా సప్లై పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  హైదరాబాద్‌లో ఉల్లి ధరల పెరగడానికి  మహారాష్ట్ర నుంచి సరఫరా కూడా కారణమేనని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలు ప్రధాన ఉల్లి సరఫరాదారు అయినా కూడా..ఏపీలో  కూడా  కర్ణాటక, మహారాష్ట్రలపై ఉల్లి గడ్డ సరఫరాల కోసం ఆధారపడి ఉండటం ఉల్లి ధరలు పెరగడానికి కారణమంగా తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =