కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge Takes Charge as President of the Indian National Congress, Mallikarjun Kharge Charge as Congress National President , Congress President Election, Congress National President Mallikarjun Kharge , Congress National President, Mallikarjun Kharge Congress Presidential Elections, Mallikarjun Kharge Congress President , Mango News, Mango News Telugu, Former Congress President Sonia Gandhi, Shashi Tharoor , Sonia Gandhi, Sonia Gandhi News, Congress Presidential Election, Rahul Gandhi Bharat Jodo Yatra

కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్ నేతలు, సీడబ్ల్యూసీ మెంబర్స్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల నుంచి పలువురు కీలక నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే సర్టిఫికెట్ అందుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అయిన మల్లిఖార్జున్ ఖార్గే భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు బుధవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ లో మహాత్మా గాంధీకి, శక్తి స్థల్ వద్ద ఇందిరాగాంధీకి, విజయ్ ఘాట్ వద్ద లాల్ బహదూర్ శాస్త్రికి, సమతా స్థల్ వద్ద బాబు జగ్జివన్ రామ్ కు, వీర్ భూమి వద్ద రాజీవ్ గాంధీకి మల్లిఖార్జున్ ఖార్గే నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ, “కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నా కర్తవ్యాన్ని నా శక్తి మేరకు నిర్వహించాను. ఈ బాధ్యత నుండి ప్రస్తుతం విముక్తి పొందాను. ఇన్నేళ్లుగా మీరు ప్రేమను, గౌరవాన్ని పొందడం నాకు గర్వకారణం, నా జీవితపు చివరి శ్వాస వరకు ఇదే అనుభూతిని అనుభవిస్తాను. మల్లిఖార్జున్ ఖర్గే మొత్తం పార్టీకి స్ఫూర్తినిస్తారని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అధ్యక్షుడిగా ఎన్నుకున్న మల్లిఖార్జున్ ఖర్గే అనుభవజ్ఞుడైన నాయకుడు మరియు తన కృషి మరియు అంకితభావంతో ఒక సాధారణ కార్యకర్త నుండి ఈ స్థాయికి చేరుకున్నారు” అని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ఇది తనకు ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. ఒక కార్మికుడి కొడుకుని, సాధారణ కార్యకర్తను, పార్టీ అధ్యక్షుడిని చేసినందుకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు. ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. “1969లో బ్లాక్ కమిటీ చీఫ్‌గా ఈ ప్రయాణాన్ని ప్రారంభించాను, ఈ రోజు మీరు ఈ స్థానం కల్పించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారు మార్గనిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం నా అదృష్టం, గర్వకారణం” అని ఖర్గే అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తలను చూసుకోవడం నా ముందున్న ప్రధాన కర్తవ్యం. మేమంతా కలిసి సాధికారత మరియు ప్రతి పౌరునికి సమానమైన భారతదేశాన్ని నిర్మిస్తాము. ఈ దేశ రాజ్యాంగాన్ని సమర్థిస్తాము, ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తాము మరియు సమాన అవకాశాలు కల్పిస్తాం. ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారిని ఓడించి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు ఆకలితో పోరాడుతామని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 1 =